పచ్చి బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలిస్తే నోరెళ్లబెడతారు.
పచ్చి బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. పచ్చి బొప్పాయి శరీరాన్ని క్లీన్ గా ఉంచుతుంది. మీరు బరువు తగ్గడంలో పచ్చి బొప్పాయి సహాయపడుతుంది. ఇందులో ఉండే పాపయిన్ మరియు చైమోపైన్ అనే ఎంజైమ్‌లు కొవ్వు కరిగించడంలో బాగా సహకరిస్తాయి. అయితే ఈ పండును ఉదయాన్నే తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. అయితే బొప్పాయి మన దేశానికీ 400 సంవత్సరాల క్రితమే వచ్చింది. మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది.
మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. బొప్పాయి కారకేసి కుటుంబానికి చెందింది. బొప్పాయి పండు తింటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు. కానీ పచ్చి బొప్పాయిలో దాగి ఉన్న ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. పచ్చి బొప్పాయిని తింటే శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పచ్చి బొప్పాయిలో మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ ఎ, సి, ఇ లు సమృద్ధిగా ఉంటాయి. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజు బొప్పాయిని తింటే శరీరంలో తొందరగా కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
డయాబెటిస్ తో బాధపడుతున్నవారు పచ్చి బొప్పాయి జ్యుస్ తాగితే రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే శరీరంలో ఇన్సులిన్ మోతాదు పెరుగుతుంది. పచ్చిబొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం లాంటి సమస్యలను పరిష్కరిస్తుంది. అలాగే ఉదరంలో గ్యాస్ తయారుకావడాన్ని నివారిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. అలాగే విటమిన్ల లోపం ఎదురుకాకుండా చూస్తుంది. గర్భిణీలు పచ్చి బొప్పాయి పండ్లను మాత్రం తినరాదు. ఎందుకంటే వాటిల్లో ఉండే లేటెక్స్, పాలవంటి పదార్థం గర్భాశయంపై ప్రభావం చూపుతుంది. దీంతో అబార్షన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చి బొప్పాయిలను గర్భిణీలు తినరాదు.
అయితే డెలివరీ అయ్యాక తల్లికి పాలు బాగా పడాలంటే పచ్చి బొప్పాయి ఎంతో తోడ్పడుతుంది. తురుముకుని కూర చేసుకున్నా, పాలు, చక్కెర వేసుకుని హల్వా చేసుకున్నా మంచిదే. పచ్చి బొప్పాయిని ఏ రూపంలో తీసుకున్న ఫర్వాలేదు. పచ్చి బొప్పాయిలో చైమప్యాపిన్, పాపైన్ అనే రెండు శక్తివంతమైన ఎంజైమ్స్ ఉండుట వలన ప్రోటీన్, కొవ్వులు, కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నానికి సహాయపడతాయి. పచ్చి బొప్పాయిలో కెరోటినాయిడ్స్ టమోటా, క్యారెట్ ల కన్నా ఎక్కువ మొత్తంలో ఉంటాయని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ జరిపిన అధ్యయనంలో తెలిసింది.
పచ్చి బొప్పాయిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉండుట వలన ఆస్తమా, ఆస్టియో ఆర్థరైటిస్, గౌట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, సోడియం సమృద్ధిగా ఉండుట వలన రక్త ప్రవాహాన్ని నియంత్రించి గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిలో పుష్కలంగా ఉండే బీటా కెరోటిన్ శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ దుష్ఫలితాలను నివారించి క్యాన్సర్ రాకుండా నియంత్రణలో ఉంచుతుంది. పచ్చి బొప్పాయిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దాంతో శరీరంలో ఇన్ ఫెక్షన్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అందువల్ల పచ్చి బొప్పాయిని తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.