Health

అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా..? ఈ ప్రాణాంతక క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. జాగర్త.

ఆరోగ్యానికి మంచిదని ఫుడ్ తీసుకుంటున్నారు కరెక్టే. కానీ ఎంత మోతాదులో ఆ ఫుడ్ తీసుకుంటున్నారనేది చెక్ చేసుకోండి. ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తీసుకుంటే.. అది మీకు ఇబ్బందులను ఇస్తుంది. దానిలో బరువు పెరగడం కూడా ఒకటి. ఆరోగ్యంగా తినడం అనేది చాలా ముఖ్యం. అయితే మీరు ఎంత తింటున్నారో అనేదానిపై శ్రద్ధ వహించండి. అయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారిలో అధిక బరువు ఉన్న వ్యక్తులు 18 రకాల ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)కు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఈ పరిశోధన కోసం 2.6 మిలియన్ల కంటే ఎక్కువ మంది BMI స్థాయి.. వారి జీవిత కాలంలో ఏవిధంగా ఉంది, అది వారి ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపింది వంటి వాటిని అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ద్వారా వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. అధిక బరువుతో ముడిపడి ఉన్న కొత్త క్యాన్సర్లలో లుకేమియా, నాన్ హడ్కిక్ లింఫోమా, అసలు పొగ తాగే అలవాటు లేని వారిలో కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు, మూత్రశయ క్యాన్సర్ల వంటి వాటికి ఆస్కారం ఎక్కువగా ఉన్నట్టు తేలిందట.

WHO ఇంటర్నేషనల్ ఎజెన్సిస్ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్‌కు చెందిన స్టడి కో లీడర్ డాక్టర్ హీంజ్ ఫ్రీస్లింగ్ స్థూల కాయంతో ఉన్న వారిలో క్యాన్సర్ ముప్పు కచ్చితంగా ఎక్కువే ఉంటుందని, డాక్టర్లు కూడా దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ అధ్యయనం ప్రారంభించిన సమయంలో.. ఇందులో పాల్గొన్న ఎవరికీ క్యాన్సర్ లేదు. కానీ చివరికి చేరే సరికి 225,396 మందికి క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది.

కొత్తగా గుర్తించిన ఐదు క్యాన్సర్లతో సహా మొత్తం 18 రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని ఈ పరిశోధకులు నిర్ధారించారు. క్యాన్సర్ ప్రివెన్షన్ చర్యల్లో తగిన బరువుతో ఉండడం అనేది కూడా చాలా ముఖ్యమైందని ఈ పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయని ఇన్‌స్టిట్యుట్ డి ఇన్వెస్టిగసియో ఎన్ అటెన్సియో ప్రిమారియా డి సలట్ జోర్డి గోల్‌కు చెందిన డాక్టర్ తలితా డువార్టే-సాల్లెస్ అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు ఈ పయోనీర్ పరిశోధన శరీర బరువు క్యాన్సర్ కు మధ్య ఉన్న క్లిష్టమైన సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు. లుకేమియా, నాన్ హడ్కిన్ లింఫోమా వంటి క్యాన్సర్లు శరీర బరువు మీద ఆధార పడి ఉన్నాయని తెలిసింది కనుక.. ఇది భవిష్యత్తులో ప్రజారోగ్య పరిరక్షణలో చాలా ప్రాధాన్యం కలిగిన పరిశోధన అని వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్‌కు చెందిన డాక్టర్ పనాగియోటా మిట్రో ఓ మీడియా సంస్థతో అన్నారు. చూశారుగా, బరువు పెరిగితే ఎన్ని సమస్యలో. ఈ రోజు నుంచే మీరంతా జాగ్రత్తగా ఉండండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker