ఎక్కువుగా చెమట పడుతోందా..? మీరు వెంటనే ఏం చేయ్యాంటే..?
బాడీ నుంచి వచ్చే చెమట కంపుతో డ్రెస్సంతా తడిచిపోయి కంపుకొడుతూ ఉంటే నలుగురిలోకి వెళ్లలేక, వారితో ఫ్రీగా మూవ్ అవ్వలేక ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక చెమట నుంచి తప్పించుకునేందుకు చాలా మంది బాడీ స్ప్రేలతో పాటు రకరకాల కెమికల్స్ స్ప్రేలు వాడుతూ అనారోగ్యాలకు గురవుతుంటారు. అయితే అధికంగా చెమట పట్టడానికి ఎన్నో కారణాలుంటాయి.
ఆత్రుత, ఆందోళన, మానసిక ఒత్తిడి, కారంగా ఉండే ఆహారాలు అధికంగా తినడం ఎక్కువగా చెమట పట్టడానికి ప్రధాన కారణాలు. ఒక్కోసారి మధుమేహం ఉన్నవారిని కూడా అధిక చెమట బాధిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నవారు వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఒక్కోసారి స్థూలకాయం, కారణం తెలియని జ్వరం వల్ల కూడా చెమటలు అధికంగా పోస్తుంటాయి. సాధారణంగా అధిక చెమట సమస్య యవ్వనంలో ప్రారంభమవుతుంది.
మెనోపాజ్ దశకు చేరుకుంటున్నప్పుడు, చేరుకున్న తర్వాత హార్మోన్ల ఉత్పత్తిలో హెచ్చుతగ్గుల కారణంగా కూడా చెమటలు పడుతుంటాయి. శరీరంలోని ఇతర భాగాల కంటే అరికాళ్లు, అరచేతుల్లో అధిక చెమట పట్టడానికి కారణం శరీరంలోని ఉష్ణోగ్రత కంటే భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులే కారణం కావచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక చెమట నివారణకు పరిష్కార మార్గాలు.. చల్లని బ్లాక్ టీలో ముంచిన మెత్తని గుడ్డతో అరచేతులను తుడవాలి.
బ్లాక్ టీలో టానిక్ ఆమ్లం ఉంటుంది. ఇది రక్తస్రావాన్ని నివారించగలుగుతుంది. బ్లాక్ టీలోని ఆస్ట్రిజెంట్ లక్షణాల వల్ల నేచురల్ యాంటీపెర్సెపిరెంట్‌గా పనిచేస్తుంది. దీంతో ఇది చెమట ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. తరచుగా ఈ పని చేయడం వల్ల అనుకున్న ఫలితం కనిపిస్తుంది. బ్లాక్ టీలో 20 నిమిషాల పాటు మీ అరచేతులను ఉంచినా మంచి ఫలితం కనిపిస్తుంది.
కొద్ది నీటిలో గంధం వేసి పేస్టు చేయండి. దీనిని అరచేతులు, అరికాళ్లు, చంకలు వంటి ప్రదేశాల్లో రాసుకోండి. గంధం బదులు అలోవెరా జెల్‌ను రాసినా మంచి ప్రయోజనం ఉంటుంది. అధిక కారాలు ఉండే ఆహారాలు, వేడివేడి ఆహార పదార్థాలను తినడం మానండి. ఎందుకంటే అవి తీసుకోవడం వల్ల పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉంటుంది. తెల్లని ఉల్లిపాయ, బ్రకోలి, బీఫ్, లివర్ వంటి పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి.