Health

ఎక్కువ సేపు కూర్చుని పని చేస్తున్నారా..? మీకు ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా..?

మనలో చాలామంది గంటల తరబడి ఒకేచోట కూర్చునే పని చేస్తుంటారు. అలా ఒక చోటే గంటల తరబడి కూర్చుని పని చేయడం మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫిట్ నెస్ గా ఉండాలని అనుకునేవారు ఈ అలవాటుని మానుకోవాలట. ఈ అలవాటు వదిలించుకోవడం కూడా పెద్ద కష్టం ఏమి కాదండి.. వెరీ సింపుల్. కుర్చీకి అతుక్కుని కూర్చోకుండా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుని రండి. అయితే ఫోన్ చూసినా, కంప్యూటర్ లో వర్క్ చేసినా, టీవీ చూసినా, మాట్లాడినా ఇలా చాలా పనులను కూర్చునే చేస్తుంటాం. కూర్చుంటే శరీరానికి ఎలాంటి శ్రమ ఉండదు. ఈ పొజీషనే బాగుందని గంటలకు గంటలు కూర్చునే వారు చాలా మందే ఉన్నారు.

ఇంకొందరు పనిలో పడి అలాగే కూర్చుండిపోతారు. అందులోనూ అటూ ఇటూ తిరగడం, నడవడం కంటే కూర్చోవడానికే తక్కువ శక్తి అవసరమవుతుంది. అందుకే చాలా మంది సిట్టింగ్ పొజీషన్ లోనే ఎక్కువగా ఉంటారు. కానీ ఇది ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుందని పరిశోధుకులు వెళ్లడిస్తున్నారు. గంటల తరబడి కూర్చోవడం వల్ల ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదల, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, శరీరంలో కొవ్వు పెరిగిపోవడం, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి.

మొత్తం మీద ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల గుండె సంబంధింత వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు పెరుగుతాయి. రోజూ ఎనిమిది గంటలకు పైగా కదలకుండా కూర్చున్న వ్యక్తులు.. అధిక బరువు, ధూమపానం వల్ల కలిగే మరణాల ప్రమాదాల్ని కలిగి ఉంటారు పరిశోధకులు కనుగొన్నారు. 1 మిలియన్ కంటే ఎక్కువ మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధయనం ప్రకారం.. ప్రతిరోజూ 60 నుంచి 75 నిమిషాల పాటు మితమమైన ఇంటెన్సివ్ శారీరక వ్యాయామంలో పాల్గొన్నా.. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందరు.

పని మధ్యలో లేచిన వారికి ఈ మరణ ప్రమాదం తక్కువగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. ప్రతిరోజూ మీరు 60 నుంచి 75 నిమిషాల పాటు ఎక్సర్ సైజెస్ చేసి.. కంటిన్యూగా 8 గంటలకు పైగా కూర్చుంటే.. వ్యాయామం ద్వారా మీరు ఎలాంటి ప్రయోజనాలను పొందలేరు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ తో చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే ఎక్కువ సేపు కూర్చోవడానికి బదులుగా ఎక్కువగా కదలండి. అలాగే తక్కువగా కూర్చోండి. ఎక్కువ సేపు నడవండి. కూర్చోవడం కంటే నిలబడటమే ఆరోగ్యానికి మంచిది.

ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. పనిమధ్యలో ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి నిలబడండి. ఫోన్ లేదా టీవీ చూస్తున్నప్పుడు మీ పాదాలను పైకి ఉంచండి. డెస్క్ వద్ద పనిచేస్తుంటే నిలబడి ఉన్న వర్క్ స్టేషన్ ను ప్రయత్నించండి. ఎత్తైన టేబుల్ లేదా కౌంటర్ ను ఉపయోగించండి. ఆఫీసుల్లో లిఫ్ట్ లను యూజ్ చేయకండి. స్టెప్స్ ను యూజ్ చేయండి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నెమ్మదిగా వ్యాయామం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. దీనివల్ల ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తారు. వ్యాయామం వల్ల బరువు తగ్గుతుంది. శక్తి పెరుగుతుంది. వ్యాయామం మీ కండరాలను మృదువుగా, బలంగా చేస్తుంది. దీనివల్ల శరీరకంగానే కాదు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker