Health

ఎక్కువుగా జిమ్ చేస్తే ఇలాంటి వారికీ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది.

తక్కువ వయసున్న వారిలోనూ గుండెపోటుతో మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే హార్ట్ ఎటాక్ అనుకోకుండా వచ్చినా.. దానికి తాలుకూ లక్షణాలు మాత్రం ముందు నుంచే మనకు హెచ్చరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే వ్యాయామం ఆరోగ్యానికి మంచిదే కానీ.. వ్యాయామం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలు మేలు చేస్తుంది. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. బరువు తగ్గుతారు. కండరాల ఆరోగ్యం బాగుంటుంది. కండరాలు పెరగుతాయి. గుండె ఫిట్ గా ఉంటుంది.

దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్పప్పటికీ.. మోతాదుకు మించి వ్యాయామాలను చేయడం ప్రాణాలకే ప్రమాదమంటున్నారు డాక్టర్లు, నిపుణులు. మరీ ముఖ్యంగా హెల్త్ బాలేనప్పుడు వ్యాయామం చేయడం రిస్క్. జ్వరం వచ్చినా మీరు అలవాగే వ్యాయమం చేస్తే.. మీ బాడీలో వాటర్ కంటెంట్ తొందరగా తగ్గిపోతుంది. దీంతో మీరు డీహైడ్రేషన్ బారిన పడతారు. దీనివల్ల జ్వరం ఎక్కువ అవుతుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఫీవర్ గా ఉన్నా ఎక్సర్ సైజెస్ చేస్తే.. కండరాల బలం తగ్గుతుంది.

అందుకే హెల్త్ బాలేనప్పుడు వ్యాయామం చేయకండి. దగ్గు ఉన్నప్పుడు వ్యాయామం చేయకూడదు.. దగ్గును లైట్ గా తీసుకోవడానికి వీల్లేదు. కానీ చాలా మంది దగ్గు ఉన్నప్పుడు కూడా కష్టతరమైన వ్యాయామాలు చేసేస్తుంటారు. నిజానికి దగ్గు ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే బాడీ వీక్ అవుతుంది. అంతేకాదు మీ బాడీ నీరసంగా మారుతుంది. కారణం మీ బాడీ డీహైడ్రేషన్ బారిన పడటం. పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తాయి..విరేచనాలు, వాంతులు, వికారం వంటి సమస్యలన్నీ పొట్టకు సంబంధించినవే. కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వ్యాయామాలు చేయడం సరికాదు.

వీటివల్ల మీ బాడీలో వాటర్ కంటెంట్ తగ్గుతుంది. దీనివల్ల మీరు మరింత నీరసించి పోతారు. అందుకే జ్వరం వచ్చినప్పుడు వ్యాయామం చేయకండి. ఇలాంటి సమయంలో రెస్ట్ ఎక్కువగా తీసుకోండి. జ్వరం ఉన్నప్పుడు బరువులను ఎత్తడం, ట్రెడ్ మిల్ పై పరుగెత్తడం మానుకోండి. ఇవి మిమ్మల్ని మరింత అనారోగ్యానికి గురిచేస్తాయి. ముఖ్యంగా మీ బాడీపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా జ్వరంగా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే మీ బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. రక్తప్రవాహం పెరుగుతుంది. దీనివల్ల మీ గుండెపై చెడు ప్రభావం పడుతుంది. ఇది గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker