ఎక్కువగా కోపం వస్తోందా..? మీకు ఈ రోగం ఉందేమో చూసుకోండి.
మీకు కూడా ఎక్కువ కోపం వస్తూ ఉంటుందా అయితే కచ్చితంగా ఈ విషయాలని మీరు పాటించాలి. కోపం ఎక్కువగా వస్తున్నట్లయితే ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు అప్పుడు కోపం నుండి ఈజీగా బయటపడొచ్చు. ప్రతిరోజు కొంచెం సేపు ధ్యానం చేయడం వలన కోపం కంట్రోల్ లో ఉంటుంది చిరాకు బాగా తగ్గుతుంది కోపం కంట్రోల్ అవ్వాలంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లని కూడా చేయండి.
అయితే మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర అనేది అంత కన్నా ముఖ్యం… ఒక్క రోజు భోజనం చేయకపోవడం కన్న ఒక్కరాత్రి నిద్రలేకపోవడం చాల ప్రభావం చూపుతుంది. అయితే సరైన ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి, రోజువారి అలవాట్లు వంటి అనేక కారాణాల వల్ల చాలా మంది నిద్రలేమి సమస్య ఎదురుకుంటున్నారు. ఈ సమస్య మరో పెద్ద సమస్య కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
రాత్రి పూట తక్కువ సమయం నిద్రపోయేవారు ఎక్కువ కోపం, మరింత విసుగుతో ఉంటారని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. అంతే కాదు కారణం ఏదైనాకూడా సరియైన నిద్ర లేనప్పుడు, విపరీతమైన కోపం, ఓపిక లేకపోవడం, భావోద్వేగ నియంత్రణ కోల్పోవడంతో పాటు ఒక నిరాశపూరిత మైన వాతావరణం లో ఉండడంవంటి చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. నిద్ర సరిపోక పొతేమెదడులో ‘అమిగ్‌డాలా’ అనేకీలకంగా ఉన్న రసాయన పనితనం మందగిస్తుంది అని జర్నల్ ఆఫ్ రీసెర్చ్ తెలిపింది.
కోపానికి, నిద్రకు చాల దగ్గర సంబంధం ఉన్నట్లు ఆధారాల తో సహా నిరూపించింది.. 7 గంటల నుంచి 9గంటల పాటు ప్రశాంతమైన, నాణ్యమైన నిద్ర ప్రతి ఒక్కరికీ అవసరం అని డాక్టర్ చెబుతున్నారు. మనం మంచి నిద్ర పోగలితే హార్మోన్లు, గుండె, మెదడు వంటి అవయవాలలో రోగనిరోధక శక్తి పెరిగి తరువాతి రోజు కి ఉత్సాహంగాఉంటారని డాక్టర్ చెబుతున్నారు.
కనీసం ఏడు గంటలకు పైగా నిద్రపోయిన వారు సాధారణంగా ఉంటే, నాలుగు గంటల కంటే తక్కువగా నిద్రపోయిన వారిలో విసుగు, చికాకు, కోపం కనిపించాయని తెలిపారు.అందుకే కంటినిండా నిద్రపోవాలి. నిద్ర కి సంబందించిన సమస్యలు అధిగమించాలంటే వ్యాయామం ,పౌష్టికాహారం.. ఫోన్ ,టీవీ ,లాంటి వి చూడడం తగ్గించి … మానసిక ప్రశాంతత కోసం చిన్న చిన్న చిట్కాలు పాటించడం చాల అవసరం.