మద్యం ఎక్కువ తీసుకునే యువతకు ఆ సామర్ధ్యం తగ్గుపోతుండా..?
మహిళలు, పురుషులు సమాన పరిమాణంలో ఆల్కహాల్ తీసుకుంటారు కాబట్టి పురుషుల కంటే మహిళల రక్తంలో ఎక్కువ ఆల్కహాల్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ మహిళల శరీరాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అలాగే వారి శరీరంలో ఎక్కువసేపు ఉంటుంది. ఈ రోజుల్లో ఆల్కహాల్ వినియోగం కౌమారదశ నుండి మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో కౌమారదశలో ఎక్కువ మద్యం సేవించడం వల్ల ఆల్కహాలిక్ మయోపతికి దారితీయవచ్చు. మద్యపానం వల్ల కలిగే నష్టాల గురించి తెలిసి కూడా మద్యపానం తాగడం ఎవరు మానేయడం లేదు.
తాగే వాళ్ళు పెరుగుతున్నారే తప్పించి తగ్గడం లేదు. ఇక నేటి యువతకు ఇది ఒక అలవాటుగా ఏదో ఒక వంకతో మద్యపానం సేవించి తమ ఫ్యూచర్ ని పాడు చేసుకుంటున్నారు. తాగుడుకు అలవాటు అయిన వ్యక్తులు తమ ఇంట్లో కుటుంబ సమస్యలను కూడా గ్రహించకుండా తాగుడుకు బానిసై తమ కుటుంబాలకు నష్టాన్ని కలిగిస్తున్నారు. అలాగే తమ శరీరాన్ని కూడా ప్రమాదంలోకి తోస్తున్నారు. మద్యపానం వల్ల కలిగే అనర్థాలను ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలు వెలుగులోకి తీసుకొచ్చాయి. పెద్ద వయసు వారితో పోలిస్తే యువతలోనే
40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు మద్యపానం వల్ల అనర్థాలు ఎక్కువగా ఉంటున్నాయని లాన్సెట్ జర్నల్ లో శుక్రవారం వెలువడిన ఒక అధ్యయనం ఫలితాలు చెబుతున్నాయి. 40 ఏళ్ల లోపు ఉన్న యువతకు మద్యపానం ఎంతో అనర్ధాలను కలిగిస్తుందని పరిశోధకులు తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 15-39 ఏళ్లలోపు వారికి ఆల్కహాల్ సేవనంతో ఎంతో హానికారక రిస్క్ ఉంటోందని పేర్కొంది. శరీరంలో ఎటువంటి వైద్య సమస్యలు లేని వారు 45 ఏళ్ల లోపు వయస్సు వారు ఒకటి నుంచి రెండు స్టాండర్డ్ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఒక స్టాండర్డ్ డ్రింక్ అంటే.. బీరు 375 మిల్లీ లీటర్లు 3.5 శాతం ఆల్కహాల్.
బ్రాందీ, విస్కీ, జిన్, వోడ్కా అయితే 30 ఎంఎల్ 40 శాతం ఆల్కహాల్. ఇలా తక్కువ మోతాదులో తీసుకునే 40 ఏళ్ల పైన వారికి గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం ముప్పు తగ్గుతున్నట్టు పరిశోధకులు తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 15 నుండి 39 వయస్సు ఉన్నవారే ఆల్కహాల్ వల్ల జరిగే ప్రమాదాలకు గురవుతున్నారని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా 60 శాతం 15 నుండి 39 వయస్సు ఉన్నవారు మద్యపానాన్ని హానికారక స్థాయిలో తాగుతున్నారని తెలిసింది. ఇంత మోతాదులో తాగితే మద్యపానాన్ని తాగితే యువతకు గుండె జబ్బు లాంటి ప్రమాదకరమైన అనారోగ్య నష్టాలు తప్పవని పరిశోధకులు చెబుతున్నారు.