హార్ట్ పేషెంట్లు ఖచ్చితంగా వీటిని తినాలి, ఒక్కసారి తింటే చాలు. వెంటనే..?
ఓట్స్ సులభంగా జీర్ణం అవుతాయి. కొవ్వును తగ్గించి , ఇన్సులిన్ లెవల్‌ను కూడా పెంచుతుంది. ఇలా ఓట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇతర విశేషాలు మీకోసం. ఓట్స్ సంవత్సరం అంతా పండుతాయి. అయితే ఓట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. కానీ దీని స్థాయిలు పెరిగిపోతేనే రక్త నాళాలలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది.
దీంతో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉండాలి. ఓట్స్ β-గ్లూకాన్ (ఓబీజీ). ఓట్స్ లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. ప్రతి 100 గ్రాముల వండని ఓట్స్ లో 390 కేలరీల శక్తి, 66 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 11.5 గ్రాముల డైటరీ ఫైబర్, 17 గ్రాముల ప్రోటీన్, 7 గ్రాముల కొవ్వు ఉంటుంది. అలాగే విటమిన్ బి 1, విటమిన్ బి5 లు కూడా ఎక్కవ మొత్తంలో ఉంటాయి. అలాగే ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి కొన్ని ఖనిజాలు కూడా ఉంటాయి.
ఇవి గుండె ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాలు. ఓట్స్ మధుమేహులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పిల్లల్లో వచ్చే ఆస్తమా ప్రమాదాన్ని ఓట్స్ తగ్గించగలవు. అలాగే ఈ ఓట్స్ ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. వీటిని బ్రేక్ ఫాస్ట్ లో తింటే మంచి ప్రయోజనాలను పొందుతారు. ఎందుకంటే ఓట్స్ తో మీ కడుపు తొందరగా నిండుతుంది. అలాగే చాలా సేపటి వరకు ఆకలిగా అనిపించదు. దీంతో మీరు ఓవర్ గా తినలేరు. ఇది మిమ్మల్ని బరువు తగ్గేలా చేస్తుంది. ఈ ఓట్స్ అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి.
దీంతో గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా ఇవి బ్లడ్ సర్కులేషన్ మెరుగ్గా జరిగేలా చేస్తాయి. ఓట్స్ తో మలబద్దకం సమస్య కూడా తగ్గిపోతుంది. ఓట్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. ఓట్స్ రొమ్ము క్యాన్సర్ ముప్పు నుంచి కూడా రక్షిస్తాయి. దీనిలో ఉండే కరిగే ఫైబర్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇవి ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. వీటిలో ఉండే మెగ్నీషియం వల్ల రాత్రుళ్లు ప్రశాంతంగా నిద్రపోతారు. ఓట్స్ ను తింటే చర్మం కూడా అందంగా మెరిసిపోతుంది. అంతేకాదు చర్మ సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి.