Health

ఉల్లిపాయరసాన్ని ఇలా రాస్తే జుట్టు జ‌న్మ‌లో జుట్టు రాల‌మ‌న్నా రాల‌దు.

కొన్ని ఉల్లిపాయ‌ల‌ను తీసుకుని మెత్త‌ని పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా బాగా మ‌ర్ద‌నా చేయాలి. త‌రువాత కొంత సేపు ఆగి త‌ల‌స్నానం చేయాలి. త‌ర‌చూ ఇలా చేస్తుంటే జుట్టు రాలే స‌మ‌స్య త‌గ్గుతుంది. అయితే మెరిసే, దృఢమైన జుట్టు పొందడానికి ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న హోం రెమెడీ. ఇది కిచెన్‌లో సులభంగా దొరుకుతుంది. ఎటువంటి రసాయనాలు లేకుండా సహజంగా తయారు చేయబడినందున, చాలా మంది సహజ సౌందర్యం కోసం దీనిని తలకు అప్లై చేస్తారు.

చాలా మంది ఈ నేచురల్ హెయిర్ మాస్క్‌తో తమకు సానుకూల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. ఉల్లిపాయలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని అంటారు. ఉల్లిపాయలలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. సల్ఫర్ హెయిర్ ఫోలికల్స్ పునరుత్పత్తికి సహాయపడుతుందని చెబుతారు. చర్మవ్యాధి నిపుణుడు డా.జై శ్రీ శరద్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇది అపోహ అని, శాస్త్రీయ అధ్యయనాలు తగినంతగా మద్దతు ఇవ్వలేదని చెప్పారు.

జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ రసం నిజంగా మంచిదైతే, బట్టతల ఉన్నవారు ఉండరు అని అంటున్నారు. అందరూ ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకుంటే జుట్టు విపరీతంగా పెరుగుతుంది కదా అని శరద్ అంటున్నారు. అది నిజంగా జుట్టు రాలడానికి కారణమవుతుందని చర్మవ్యాధి నిపుణులు శరద్ అంటున్నారు. నిజానికి ఇది చికాకు, దద్దుర్లు, కాలిన గాయాలు, జుట్టు నష్టం కలిగిస్తుందట. మీరు జుట్టు రాలడాన్ని ఎదుర్కొంటుంటే, చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండని చెబుతున్నారు. నిపుణుల సలహా లేకుండా ఇంటి నివారణలను ఉపయోగించడం మానుకోవాలని డాక్టర్ శరద్ చెప్పారు.

ఈస్తటిక్ క్లినిక్స్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ రింకీ కపూర్ మాట్లాడుతూ.. ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకోవడం వల్ల అందరికీ ఒకే రకమైన ప్రయోజనం ఉండదని, కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్‌ను ఎదుర్కొంటారని అంటున్నారు. ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించడం వల్ల కేవలం 2 వారాల్లో తలపై జుట్టు తిరిగి పెరుగుతుందని నమ్ముతారు. కానీ, జుట్టుకు ఉపయోగించే ముందు చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.

‘ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం వల్ల అందరికీ ప్రయోజనం ఉండదు. ఇది మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది. ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలకు లేదా ఇతర జుట్టు సమస్యలకు సహాయపడుతుందని సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మకండి. ఉల్లిపాయ రసం తలపై మంట, దురద కలిగించవచ్చు. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది. కాబట్టి ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించకుండా ఉండటం మంచిది.’ అని రింకీ కపూర్ అంటున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker