ఉల్లిరసం గురించి తెలిస్తే ఇప్పుడే వాడుతారు. ఎందుకంటే..?
ఉల్లిపాయ వల్ల గుండె సమస్యలు, తలనొప్పి, క్యాన్సర్ వంటి సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.ఉల్లిపాయలో విటమిన్ సి ఎక్కువ ఉండటం వల్ల ఇమ్మ్యూనిటీ పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. అయితే ఒత్తుగా ఉండే జుట్టు కోసం.. నాలుగు నుంచి ఐదు చెంచాల ఉల్లిపాయ రసంలో రెండు చెంచాల పటిక కలపండి, ఈ మిశ్రమాన్ని తలకు మసాజ్ చేయండి.
రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇందులోని రిసినోలిక్ యాసిడ్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. సిల్కీ జుట్టు కోసం.. రెండు చెంచాల ఉల్లిపాయ రసానికి ఒక చెంచా తేనె మిక్స్ చేసి జుట్టుకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. సిల్కీగా కూడా మారుతుంది. బలమైన జుట్టు కుదుళ్ల కోసం.. ఒక గిన్నెలో గుడ్డును గిలక్కొట్టండి.
అందులో నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసం, 3 చుక్కల టీ-ట్రీ ఆయిల్ వేసి బాగా కలపండి. దీన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు మూలాలు బలంగా మారుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గించడం..అరకప్పు కొబ్బరి నూనెలో ఒక ఉల్లిపాయను పేస్ట్ చేసి వేసి, బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయండి. అరగంట తర్వాత జుట్టు కడగాలి.
ఇలా వారానికి రెండుసార్లు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు తెల్లబడకుండా..ఉల్లిపాయ నుండి రసాన్ని తీసి, ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ ఉల్లిపాయ రసంలో కొన్ని ఎండిన కరివేపాకులను కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత స్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు నెరసిపోవడం, తెల్లబడటం తగ్గుతుంది. ఉల్లిపాయ నూనె ఎలా తయారు చేయాలి..ఒక గిన్నెలో రెండు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, 4-5 స్పూన్ల కొబ్బరి నూనె వేసి చిన్న మంటపై వేడి చేయండి. నూనె రంగు మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. చల్లారిన తర్వాత, ఈ మిశ్రమాన్ని జల్లెడలో ఫిల్టర్ చేసి, నిల్వ చేయండి.