ఇలాంటి ఓట్స్ తింటే చాలా ప్రమాదం. ఎందుకో ఈ విషయాలు తెలుసుకోండి.
ఓట్స్ సంవత్సరం అంతా పండుతాయి. పైగా భారీ వర్షాపాతాన్ని కూడా తట్టుకోగలవు. యూరోప్, పశ్చిమాసియాలో ఓట్స్ను వేలాది సంవత్సరాలుగా పండిస్తున్నారు. మీరు షాక్ అవ్వొచ్చుకానీ.. దీన్ని అక్కడి వారు ఎక్కువగా పశువుల దాణాగా వినియోగించేవారు. అయితే ఓట్స్ అనేక రూపాల్లో లభిస్తుంది. వాటిలో అత్యంత సాధారణ రకం రోలద వోట్స్.చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉండటం వల్ల సులభంగా వండుకోవచ్చు. ఓట్స్ ఆవిరి చేయడం వల్ల వ్యాధికారక సూక్ష్మ జీవుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
రోల్డ్ లేదా ఇన్ స్టంట్ ఓట్స్ ఉపయోగించి వంటకాలు చేసుకుని తినడం మేలు. కొన్ని పదార్థాలు పచ్చివి లేదా ఉడికించుకుని తింటారు. అయితే ఓట్స్ పచ్చివి తినొచ్చా అనే సందేహం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పచ్చి ఓట్స్ తిన్నా కూడా సురక్షితమే. జీర్ణాశయ బాధ, పొట్ట ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, పొట్టి కడుపు నొప్పి వంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఓట్స్ పచ్చివి తినకపోవడమే మంచిది . పచ్చిగా ఓట్స్ తినడం సురక్షితం అయినప్పటికీ ఈ సమస్యలని మరింత ఎక్కువ చేస్తాయి. ఓట్స్ భద్రపరిచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తేమ ఉన్న ప్రదేశంలో ఉంచడం వల్ల వాటిలో బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
ముడి ఓట్స్ తాజాగా ఎక్కువ రోజులు ఉండేలా చేయడం చాలా ముఖ్యమైన విషయం. వీటిని ఒక ఫ్రీజర్ బ్యాగ్ లో నిల్వ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఒక సంవత్సరం వరకు అవి చెడిపోకుండా ఉంటాయి. పది, చల్లని ప్రదేశంలో ఓట్స్ పొడి నిల్వ చేసుకోవచ్చు. గట్టి కంటైనర్ తీసుకుని వాటిలో ఓట్స్ వేసి బిర్రుగా మూత పెట్టుకున్నా సరిపోతుంది. రిసీలబుల్ ప్లాస్టిక్ బ్యాగ్ లేదా ప్లాస్టిక్ కంటైనర్ లో కూడా పెట్టుకోవచ్చు. ఆహార పదార్థాలకి సంబంధించి తినే ముందు గడువు తేదీ చూసుకుని తింటారు. తేదీ దాటితో వాటిని తీసుకోకూడదు.
కానీ ఓట్స్ విషయంలో ఆ అవసరం లేదు. గడువు తేదీ దాటినా తీసుకోవచ్చు. అయితే ఆ పదార్థం ఎటువంటి వాసన లేకుండా రుచిగా ఉంటే మాత్రమే తీసుకోవాలి. చెడు వాసనగా అనిపిస్తే వాటిని తీసుకోకపోవడమే ఉత్తమం. ఓట్స్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గించడంలోను సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకున్నప్పుడు స్మూతీస్ తయారుచేసేటప్పుడు అందులో కొద్దిగా ఓట్స్ పొడి కలుపుకుని తీసుకోవచ్చు. అయితే వాటిని సరైన పద్ధతిలో తీసుకున్నప్పడే ప్రయోజనాలు పొందగలుతాము. చప్పగా ఉన్నాయి కదా అని తీపి జోడిస్తే కేలరీలు పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంది.