తలలో దురద, పొడి బారడం వంటి సమస్యకు విముక్తి ప్రసాదించే నూనె. ఎలా వాడాలంటే..?
తలలో దురద, పొడి బారడం వంటి సమస్యకు విముక్తి ప్రసాదించే నూనె.
తల దురద. ఇది చుండ్రు మరియు తామర వంటి కారణాలతో పాటు అత్యంత చికాకు కలిగించే సంచలనాలలో ఒకటి. ఇది పొడి మరియు దురదకు కారణమవుతుంది. అయితే తలలో దురదకు మూల కారణం తల పొడి బారటం. చలికాలంలో ముఖ్యంగా దురద, చుండ్లు, వెంట్రుకలు రాలడం ఒకటా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
శీతాకాలం మంచుకు తిరగటం వల్ల తల బాగా దురద పెడుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల సైతం ఈ సమస్య వస్తుంది. దురద కారణంగా తల గోకుతూ ఉంటే చుండ్రు సమస్య, వెంట్రుకలు రాలడం మరింత పెరుగుతుంది ఈ సమస్య నుంచి బయటపడటానికి తలకు రకరకాల కెమికల్స్ తో తయారైన షాంపూలు, నూనెలు రాస్తుంటారు.. వాటి వల్ల జుట్టు ఊడిపోవటం లాంటి నష్టాలు కలుగుతాయి. అయినప్పటికీ సమస్య తగ్గదు.
మరి ఈ దురద సమస్యకు కొబ్బరి నూనె చాలా బాగా పని చేస్తుంది. కొబ్బరి నూనెను వేపతో కలిపి ఉపయోగిస్తే జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి గాను గుప్పెడు వేప ఆకులు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో రెండు చెంచాల కొబ్బరి నూనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి చేతి వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. కనీకం 25 నిమిషాలు తలకు పట్టించి అలా వదిలేయాలి. ఆరిన తర్వాత షాంపూతో తలస్నానం చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీకు దురద నుంచి ఉపశమనం లభిస్తుంది. వేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది యాంటీమైక్రోబయల్, యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పని చేస్తుంది. తలపై దురద, చుండ్రు సమస్యను తొలగించడానికి ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. కొబ్బరి నూనె తలలో దురదను తగ్గిస్తుంది. ఇది తలలో తేమను నార్మల్ చేయడంలో తోడ్పడుతుంది.