ఆఫర్ ఉందని రూ.లక్ష విలువైన ల్యాప్‌టాప్ బుక్ చేశాడు. ఓపెన్ చేసి చూస్తే కళ్లు బైర్లు కమ్మేలా..!
కొన్ని సందర్భాల్లో ఒక వస్తువును బుక్ చేస్తే మరో వస్తువు డెలివరీ కావడం, నకిలీ వస్తువులు రావడం వంటి సంఘటనలు చూసే ఉంటాం. దీంతో కస్టమర్స్ ప్రొడక్ట్స్‌ను ఓపెన్ చేసే సమయంలోనే వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ సంఘటనలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఇలాంటి ఓ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా మధ్యప్రదేశ్‌కు చెందిన సౌరవ్ ముఖర్జీ అనే వ్యక్తి రూ.1.13 లక్షల విలువైన ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు. తర్వాతి రోజే అతడి ఇంటికి ల్యాప్‌టాప్ వచ్చింది. డెలివరీ బాయ్ వీడియో తీస్తుండగా సౌరవ్ ఆ పార్సిల్ ఓపెన్ చేశాడు. పార్సిల్ ఓపెన్ చేసి లోపల ఉన్న వస్తువును చూసిన సౌరవ్‌కు కళ్లు బైర్లు కమ్మాయి. ఎందుకంటే లోపల పాత పాడైపోయిన ల్యాప్‌టాప్ ఉంది.
ఆ ల్యాప్‌టాప్ చూసి సౌరవ్ మాత్రమే కాదు.. ఆ డెలివరీ బాయ్ కూడా ఆశ్చర్యపోయాడు. ఇది పాత ల్యాప్‌టాప్‌లా ఉందని డెలివరీ బాయ్ చెబుతుండడం ఆ వీడియోలో రికార్డు అయింది. వెంటనే సౌరవ్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. వెంటనే స్పందించిన ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు సౌరవ్ ముఖర్జీకి క్షమాపణలు చెప్పారు.
సంబంధిత వివరాలను మెసేజ్ చేయాలని కోరారు. కాగా, సౌరవ్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.