News

ఇండస్ట్రీలో వరుస విషాదాలు, కూతుళ్లతో సహ మరణించిన స్టార్ హీరో.

ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర సాంకేతిక వర్గానికి సంబందించిన వారు హార్ట్ ఎటాక్, వయోభారం, రోడ్డు ప్రమాదాలు ఇలా పలు కారణాల వల్ల చనిపోతున్నారు. మరికొంతమంది నటులు కెరీర్ సరిగా లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో డిప్రేషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. అయితే ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్.. అతని ఇద్దరు కూతుళ్లు విమాన ప్రమాదంలో మరణించారు.

జనవరి 4న తూర్పు కరేబియన్ లోని బెక్వియా సమీపంలోని ప్రైవేట్ ద్వీపం పెటిట్ నెవిస్ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెకేషన్‏లో భాగంగా ఒలివర్ తన కుటుంబంతో కలిసి గ్రెనడైన్స్‏లోని బెక్వియా ద్వీపం నుంచి సెయింట్ లూసియాకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే బెక్వియాలో టేక్ఆఫ్ అయిన కాసేపటికే విమానం కరేబియన్ సముద్రంలో కుప్పకూలింది.

దీంతో 51 ఏళ్ల ఒలివర్‏తోపాటు ఆయన ఇద్దరు కుమార్తెలు మడిత (10), అన్నీక్ (12) అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో పైలట్ కూడా మృతిచెందారు. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది మత్య్సకారులతో కలిసి వారి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు. నటుడిని క్రిస్టియన్ క్లెప్సర్ అని కూడా పిలుస్తారు. ఒలివర్ జర్మనీలో జన్మించాడు.

వెండితెరపై ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. స్పీడ్ రేసర్, 2008 స్పోర్ట్స్ యాక్షన్ కామెడీ ది గుడ్ జర్మన్ , స్టీవెన్ సోడర్‌బర్గ్ తెరకెక్కించిన 2006 ప్రపంచ యుద్ధం II సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మొత్తం 60కి పైగా చిత్రాల్లో నటించాడు. అలాగే బుల్లితెరపై అనేక షోలలో పాల్గొన్నాడు. కెరీర్ ప్రారంభంలో “సేవ్డ్ బై ది బెల్: ది న్యూ క్లాస్” , మూవీ “ది బేబీ-సిట్టర్స్ క్లబ్” లో నటించాడు.

అతను కోబ్రా 11 టెలివిజన్ సిరీస్‌లో కూడా కనిపించాడు .

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker