చనిపోయే ముందు ANR కు ఫోన్ చేసి Sr NTR ఏం చెప్పారో తెలుసా..?
నటరత్న డాక్టర్ నందమూరి తారకరామారావు, నట సమ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు… ఇద్దరూ ఇద్దరే. తెలుగు చిత్రరంగానికి రెండు కళ్లలా మెలిగారు. తెలుగు చిత్రపరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి, తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను ఇద్దరు హీరోలు అందించారు. వీరిద్దిరిలో కొన్ని సారూప్యాలు, మరికొన్ని వైరుధ్యాలున్నాయి. అయితే ఎన్టీఆర్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించిన వ్యక్తి.అలాంటి ఈ హీరో గతంలో చాలా మల్టీస్టారర్ సినిమాల్లో కూడా చేశారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ల ఇద్దరు చాలా సినిమాలలో కలిసి నటించారు. అయితే ఇప్పటి జనరేషన్ లో చాలామంది హీరోల అభిమానులు మల్టీస్టారర్ సినిమాలు తీస్తే అస్సలు ఒప్పుకోవడం లేదు. కానీ గతంలో అయితే చాలామంది స్టార్ హీరోలు మల్టీ స్టారర్ సినిమాల నే చేసేవారు.అయితే గతంలో ఎన్టీఆర్ ఏఎన్నార్ల జోడీకి హిట్ పెయిర్ గా వెండి తెర పై మంచి గుర్తింపు కూడా వచ్చింది. వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఎన్టీఆర్ ఏఎన్నార్ల మధ్య బంధం చెడింది..ఇక దీనికి కారణం ఏంటో ఎవరికి కూడా తెలియదు.
కానీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మాటల కారణంగానే వీరిద్దరూ విడిపోయారని గతంలో వార్తలు కూడా వినిపించాయి. అయితే వీరిద్దరి విషయం గురించి రచయిత కృష్ణకుమారి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్నార్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. వీరి మధ్య బంధం ఎలా ఉండేదంటే ఒకరి ఇంట్లో ఫంక్షన్ అయితే మరొకరు తప్పకుండా హాజరయ్యే వారు.కానీ అలాంటి వీరి మధ్య ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది చెప్పుడు మాటలతో వీరి మధ్య బంధం చెడిపోయింది.
కానీ ఆ తర్వాత మళ్లీ కలిశారు.. అయితే ఓ రోజు నేను ఏఎన్ఆర్ గారి ఇంటికి వెళ్లినప్పుడు ఏఎన్ఆర్ కి సీనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి బ్రదర్ మిమ్మల్ని ఒకసారి చూడాలనిపిస్తుంది అంటే అదేంటి బ్రదర్ ఎందుకు అలా అంటున్నారు. మొన్ననే కదా మనం ఇద్దరం కలిసాం. మీ ఇంటికి భోజనానికి కూడా వచ్చాను అని ఏఎన్ఆర్ అన్నారుకానీ దానికి ఎన్టీఆర్ లేదు బ్రదర్ మరొకసారి మిమ్మల్ని కలిసి నా మనసులో ఉన్న బాధ మొత్తం తీర్చేసుకోవాలి. ఒకసారి మా ఇంటికి రండి అని చాలా ఎమోషనల్ గా అయితే అడిగారు.
అయితే వీరిద్దరూ ఫోన్ లో మాట్లాడుకుంటునప్పుడు రచయిత కృష్ణకుమారి అక్కడే ఉన్నారని తెలుస్తుంది.అంతేకాదు ఈ విషయాలన్నీ ఏఎన్ఆర్ ఆయన భార్య అన్నపూర్ణమ్మతో కూడా చెప్పుకున్నారని సమాచారం.కానీ ఏఎన్ఆర్ మరుసటి రోజు ఎన్టీఆర్ ను చూడడానికి వెళ్దాము అనుకునే టైంలోనే ఎన్టీఆర్ చనిపోయారు అని మరణ వార్త అయితే వినిపించింది. అలా సీనియర్ ఎన్టీఆర్ చనిపోయే ముందు ఏఎన్ఆర్ ని చూడాలని అనుకున్నారట.