News

ఓరి దేవుడో ..! ఆర్జీవి హీరోయిన్ ఇలా మారిందేంటి..? భక్తి బాట పట్టిన హాట్ హీరోయిన్.

నిషా కొఠారి భారతీయ సినిమా నటి, మోడల్. నిషా కొఠారిగా పేరుపొందిన ఈమె అసలు పేరు ప్రియాంక కొఠారి, తరచుగా అమోహ అనికూడా పిలుస్తారు. ఆమె బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలలో కూడా నటించింది. ఆమె ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ చిత్రాలలో కనిపించింది. అయితే వర్మ హీరోయిన్స్ లో నిషా కొఠారి కూడా ఒకరు. నిషా కొఠారి 2003లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. ఆమె మొదటి చిత్రం జే జే. ఈ తమిళ చిత్రంలో ఆర్ మాధవన్ హీరోగా నటించాడు.

రెండో చిత్రమే దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసింది. మధ్యాహ్నం హత్య పేరుతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ చిత్రం తెరకెక్కించాడు. జేడీ చక్రవర్తి, నిషా కొఠారి ప్రధాన పాత్రలు చేశారు. దర్శకుడు వర్మ నిర్మించిన జేమ్స్ మూవీలో నిషా కొఠారి గ్లామరస్ రోల్ లో అలరించింది. 2005లో విడుదలైన సర్కార్ భారీ విజయం అందుకుంది. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ మూవీలో నిషా కొఠారి సైతం నటించింది.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ(2006), ఆగ్ చిత్రాల్లో కూడా నిషా కొఠారి హీరోయిన్. విపరీతమైన ఎక్స్ పోజింగ్ తో కుర్రాళ్ళ గుండెల్లో నిషా కొఠారి గుబులు రేపింది. దర్శకుడు వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఒక్క మగాడు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నిషా కొఠారి నటించడం విశేషం. 2013కి వచ్చిన సైకో మూవీలో మరోసారి నిషా కొఠారికి ఛాన్స్ ఇచ్చాడు వర్మ. అయితే వర్మ డైరెక్షన్ లో ఆమె చేసిన చిత్రాలేవీ ఆడలేదు. ఒక సర్కార్ మాత్రమే ఆకట్టుకుంది.

నిషా కొఠారి తన పేరును ప్రియాంక కొఠారిగా మార్చుకుంది. ఫలితం మాత్రం శూన్యం. కాగా ఆమె షాకింగ్ మేకోవర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పొట్టి బట్టల్లో విపరీతమైన ఎక్స్ పోజింగ్ చేసిన నిషా కొఠారి భక్తి బాట పట్టింది. కాషాయ బట్టల్లో ఆమె భక్తురాలిగా మారిపోయిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ మార్పుకు కారణం ఏమిటని జనాలు అవాక్కు అవుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker