News

గుడ్ న్యూస్. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.

పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర ప్రభావం అనేక రంగాలపై పడింది.

అయితే మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగి వచ్చాయి. పసిడి రేటు దిగి వచ్చింది. మే 16న ఉదయం 11.15 గంటల సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 మేర తగ్గింది. దీంతో బంగారం ధర పది గ్రాములకు రూ. 60,860కు క్షీణించింది. అలాగే బంగారం ధర మాదిరిగానే వెండి కూడా పడిపోయింది. సిల్వర్ రేటు నేడు రూ. 500 దిగి వచ్చింది. దీంతో వెం ధర కేజీకి రూ. 72,900కు పడిపోయింది.

బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగి రావడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని చెప్పుకోవచ్చు. గ్లోబ్ల మార్కెట్‌లో బంగారం ధరలను గమనిస్తే.. గోల్డ్ రేటు ఔన్స్‌కు 0.21 శాతం పడిపోయింది.

2018 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అలాగే వెండి రేటు 0.17 శాతం తగ్గింది. ఔన్స్‌కు 24.11 డాలర్ల వద్ద ఉంది. కాగా మరో వైపు హైదరాబాద్ మార్కెట్‌లో చూస్తే.. బంగారం ధరలు పైస్థాయిలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,910 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. రూ. 56,750 వద్ద ఉంది.

పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. ఇక వెండి రేటు రూ. 78,500 వద్ద ఉంది. కాగా పైన ఇచ్చిన బంగారం ,వెండి ధరలకు వస్తు సేవల పన్ను అదనం అని గుర్తించుకోవాలి. జీఎస్‌టీతో పాటుగా తయారీ చార్జీలు కూడా ఉంటాయి. వీటిని కూడా కలుపుకుంటే బంగారం ధరలు ఇంకా పైకి చేరుతాయని చెప్పుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker