నొప్పులు లేకుండా నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం చెయ్యాలో తెలుసుకోండి.
నార్మల్ డెలివరీకీ నేచురల్ డెలివరీకీ కొన్ని తేడాలున్నాయి. నార్మల్ డెలివరీలో కొంతైనా బయటి నుంచి చేసే సాయం ఉంటుంది. నొప్పి తగ్గడానికి ఇచ్చే ఇంజెక్షన్స్ ఉంటాయి. ఎపిసియాటమీ అంటే బిడ్డ బైటికి రావడానికి వీలుగా యోని ద్వారాన్ని కొంచెం వెడల్పు చేస్తారు. ఇంకా అవసరమైతే ఫోర్సెప్స్‌తో బిడ్డని బయటికి తీస్తారు. నాచురల్ డెలివరీలో అవేమీ ఉండవు. అయితే వయసు ఇరవై ఏడు. ప్రస్తుతం ఎనిమిదో నెల. నాకు ప్రసవం అంటే భయం.
మా కజిన్‌కు అమెరికాలో డెలివరీ అయ్యింది. అక్కడ ఏదో ఇంజెక్షన్ ఇచ్చి నొప్పులు తెలియకుండా సాధారణ ప్రసవం చేశారట. ఏమిటా ఇంజెక్షన్..? మన దగ్గర కూడా లభిస్తుందా..? ఇబ్బందులేమైనా ఉంటాయా..? నొప్పులు ఎక్కువగా తెలియకుండానే నార్మల్ డెలివరీ చేసే పద్ధతులు మన దగ్గరా అందుబాటులో ఉన్నాయి. మీరు చెప్పినట్టు పెయిన్స్ రాగానే ఒక ఇంజెక్షన్ ఇస్తారు. దాన్ని ‘ఎపిడ్యూరల్ ఎనాల్జీషియా’ అంటారు.
నొప్పులు మొదలై.. గర్భాశయ ముఖద్వారం కనీసం నాలుగు సెంటీమీటర్లు తెరుచుకున్నాక… మత్తు డాక్టర్ సాయంతో ఈ ఇంజెక్షన్ ఇస్తాం. దీనివల్ల పెద్దగా నొప్పులు తెలియవు. ప్రసవానికి సంబంధించిన సంకోచ వ్యాకోచాలు కూడా సాధారణంగానే ఉంటాయి. దాంతో సాధారణ ప్రసవం అవుతుంది. అయితే నొప్పి తెలియకపోవడం వల్ల ఓ ఇబ్బంది ఉంది. ఒక్కోసారి బిడ్డ తల బయటికి వచ్చాక కూడా పూర్తి శరీరం బయటికి వచ్చేందుకు అనువుగా ముక్కలేకపోతారు.
ఫోర్‌సెప్స్ లేదా వాక్యూమ్‌లను వాడి శిశువును బయటికి తీయాల్సివస్తుంది. ఏదైనా లోపల ఇబ్బంది కలిగి సాధారణ ప్రసవానికి అవకాశం లేకపోతే.. వెంటనే సిజేరియన్ చేయవచ్చు. రెండోరకం, లేబర్ ఎనాల్జీషియా. ఈ ఇంజెక్షన్ వల్ల కూడా నొప్పులు ఎక్కువగా తెలియవు. దీన్ని గైనకాలజిస్టే ఇవ్వవచ్చు. అయితే ఇక్కడ సిజేరియన్ అవసరమైతే మళ్లీ మత్తు ఇవ్వాల్సి వస్తుంది.
ఇలా ఇంజెక్షన్ సాయంతో ప్రసవం చేయడం వల్ల కొన్నిసార్లు బాలింతలు మూత్రం మీద పట్టుకోల్పోతారు. కొద్ది రోజులు ట్యూబ్ వేయాల్సి వస్తుంది. ఆ తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటారు. కాబట్టి, నొప్పులు ఎక్కువగా తెలియని సుఖప్రసవానికి మీకూ అవకాశం ఉంది. భయపడనక్కర్లేదు. డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్.