ఒకప్పుడు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్, ఇప్పుడు చేతిలో సినిమాలు లేక ఏం చేస్తుందో తెలుసా..?
చిత్ర పరిశ్రమలో హీరోలకు లాంగ్ కెరీర్ ఉంటుంది. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం కెరీర్ స్పాన్ చాలా తక్కువ. అయితే ఒకప్పటి హీరోయిన్లు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా రాణిస్తున్నారు. అయితే ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న తారల.. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ నటి సుకన్య. సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు.
చెన్నైలో జన్మించిన సుకన్య.. తమిళ్ నిర్మాత రమేష్ కూతురు.1991లో భారతీరాజా దర్శకత్వం వహించిన పుదునెల్లు పుదు నాథు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇటు సినీ కెరీర్ లోనే కాకుండా అటు వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంది. 2002లో అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ శ్రీధర్ ను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడింది. కానీ సంవత్సరంలోపే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది.
ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి తిరిగి సినిమాల్లో నటించడం ప్రారంభించింది. భాషతో సంబంధం లేకుండా దక్షిణాదిలో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. “తమిళం, తెలుగు, మలయాళం భాషలలో సినిమాలు చేశాను. నేనెప్పుడు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోలేదు. సినిమాల నుంచి తప్పుకోలేదు. నేను నటించిన సినిమాలకు అవార్డ్స్ కూడా వచ్చాయి.
నా నటనను ప్రశంసించారు. నాకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. కానీ వాటి గురించి ఎవరు మాట్లాడరు. నేను సినిమాల్లో నటించేందుకు రెడీగానే ఉన్నాను. కానీ నాకు అవకాశాలు ఇవ్వడం లేదు” అంటూ చెప్పుకొచ్చింది. తాను సినిమాల్లో నటించేందుకు సిద్ధంగానే ఉన్నానని.. కానీ తనను ఎవరు పిలవడం లేదని ఓపెన్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సుకన్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.