Health

శరీరంలో ఈ అవయవాలు లేకున్నా మనిషి బతకగలడు, అవేంటంటే..?

మన శరీరం కూడా తనలో జరిగే జీవక్రియలకు ఒక్కో సమయాన్ని కేటాయిస్తుంది. ఆ సమయంలో ఆయా అవయవాలు యాక్టివ్‌గా పనిచేస్తాయి. దీనివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మన శరీర అవయవాలు యాక్టివ్‌గా ఉన్న సమయంలో వాటికి విరుద్ధంగా మనం చేసే కొన్ని పనుల వల్ల ఆయా భాగాలపై ఒత్తిడి పెరిగి మనకు అనారోగ్యం కలుగుతుంది. అయితే మనకు శరీరంలో కొన్ని జత అవయవాలుంటాయి. అందువల్ల ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు వచ్చి అవయవాన్ని తొలగించాల్సి వస్తే.. దాని పనిని కూడా రెండవది చేస్తుంది. టాన్సిల్స్..గొంతులో కిందవైపున కొండ నాలుకకు ఇరువైపులా రెండు చిన్నచిన్న గోలీల్లాంటివి కనబడతాయి. వాటినే టాన్సిల్స్‌ అంటారు.

ఆహారం లేదా మనం పీల్చే గాలి ద్వారా గొంతులో ప్రవేశించే సూక్ష్మక్రిములతో పోరాడటం వీటి పని. ఈ క్రమంలో కొన్నిసార్లు ఇవే బలహీనపడి ఇన్ఫెక్షన్‌ బారిన పడతాయి. దీంతో ఇవి వాయటం, గొంతు నొప్పి, గుటక మింగటం కష్టంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా ఇన్ పెక్షన్ కు గురువుతూ ఉంటాయి. వీటి వల్ల అంతగా ఉపయోగం ఏమీ ఉండదు. పెద్ద ప్రేగు.. పెద్ద పేగు లేకుండా కూడా మనిషి జీవించవచ్చు, కొన్ని పరిస్థితుల కారణంగా, పెద్ద ప్రేగును కూడా కొంతభాగం తొలగించవలసిన పరిస్థితులు వస్తాయి. అలా పెద్ద పేగును తొలగించిన తర్వాత దానీ స్థానంలో మీకు కొలొస్టోమీ బ్యాగ్ అవసరంగా ఉంటుంది.

ప్లాంటరిస్ కండరము.. ప్లాంటరిస్ కండరము అంటే అరికాలి కండరము అంటారు. అయితే సుమారు 9% మంది ఈ కండరాలు లేకుండానే జన్మిస్తారు. అయినా వారికి ఎలాంటి నష్టంగానీ, ఇబ్బందిగానీ ఉండదు. ఒకవేళ ఇది ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ కండరము లేకున్నాగానీ మనుషులు బతకలగలరు. కాలి చిటికెన వేలు.. రెండు కాళ్లకు మొత్తం పది వేళ్లు ఉంటాయి. అయితే ప్రతి పాదానికి ఉండే చిటికెన వేలు అసలు అవసరం లేదు. మనం చెట్ల కొమ్మలపై ఎక్కువగా నడవం కాబట్టి దీని ఉపయోగం అంతగా ఉండదు. మనం ఈ కాలి చిటికెన వేల్లు లేకున్నా కూడా బాగా నడవగలుగుతాం, పరుగెత్తుతాం.

అపెండిక్స్.. చిన్నపేగు, పెద్ద పేగు కలిసే చోట అపెండిక్స్ ఉంటుది. దీన్నే ఉండుకము అంటారు. అయితే ఇది కొన్నిసందర్భాల్లో ఎర్రగా మారి వాపునకు గురువుతుంది. దీనినే అపెండిసైటిస్ అంటారు. దీంతో వీపరీతైమన నొప్పి ఏర్పడుతుంది. పెద్ద పేగులో ఏదైనా పదార్ధం అడ్డుపడితే ఇలాంటి సమస్య వస్తుంది. దీంతో వెంటనే దీన్ని ఆపరేషన్ చేసి తొలగించాల్సి ఉంటుంది. ఉండుకము శరీరంలో ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కిడ్నీ..ఈ అవయవం రక్తాన్ని మలినాలు లేకుండా ఉంచడాని ఫిల్టర్‌గా పనిచేస్తుంది.

అందరూ రెండు మూత్రపిండాలతో పుడతారు. అయితే కొందరు వ్యాధి కారణంగా ఒకదాన్ని వదులుకోవలసి ఉంటుంది, అంతేకాదు మరికొందరు తమ మూత్రపిండాలలో ఒకదాన్ని అవసరమైన వారికి దానం చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక మూత్రపిండంతో జీవించడం చాలా సాధారణం. కడుపు భాగం.. కడుపు క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ఆపరేషన్ ద్వారా కొంతభాగం తొలగించవలసి ఉంటుంది. కానీ, ఆ తరువాత అన్నవాహికను నేరుగా చిన్న ప్రేగులతో అనుసంధానించవలసి ఉంటుంది. ఇదే పూర్తిగా కడుపు యొక్క పనితీరును తీసుకుంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker