విలాసవంతమైన జీవితాన్ని వదిలి సినిమాల్లో కష్టపడుతున్న హీరోయిన్.
నివేదా పెతురాజ్ దక్షిణ భారతదేశ సినీ నటి , మోడల్. తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తోంది. ఒరు నాల్ కూతు అనే తమిళ చిత్రంతో ఆమె నటనా రంగ ప్రవేశం చేసింది. తెలుగులో మెంటల్ మదిలో చిత్రంతో అరంగ్రేట్రం చేసింది. నివేదా పేతురాజ్ కోవిల్పట్టిలో జన్మించింది. తన పాఠశాల విద్యను తూత్తుకుడిలో పూర్తి చేసింది. తన చిన్న వయస్సులో ఆమె తల్లిదండ్రులతో దుబాయ్ వెళ్ళి 20 సంవత్సరాలు అక్కడ ఉంది. 2015 లో మిస్ ఇండియా యుఎఇ పోటీని గెలుచుకుంది.
అయితే నివేత బాల్యం లోని విద్యాబ్యాసం మొత్తం అక్కడే జరిగింది, ఆ తర్వాత ఆమెకి 11 ఏళ్ళ వయస్సు వచ్చినప్పుడు తల్లితండ్రులతో పాటుగా దుబాయ్ కి వెళ్ళిపోయింది.అక్కడ క్రిసెంట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో చదువుకుంది.. తన డిగ్రీ కూడా హీరోయిట్ వాట్ యూనివర్సిటీ లో పూర్తి చేసింది.. అంతే కాదు UAEలో ప్రతీ ఏడాది నిర్వహించే మిస్ ఇండియా కాంపిటీషన్ లో 2015వ సంవత్సరానికి గాను ఈమె టైటిల్ ని గెల్చుకుంది. ఆమె బాల్యం మొత్తం చూస్తూ ఉంటే పెద్దగా ఒడిదుడులు ఏమి ఎదురుకున్నట్టు అనిపించడం లేదు, చాలా లగ్జరీ జీవితాన్నే గడిపింది.
కానీ సినిమాల్లో అవకాశాలు సంపాదించడం అంటే అంత తేలికైన విషయం కాదు, సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికి చాలా తేలికగా ఎంట్రీ ఉంటుంది కానీ, మిగిలిన వాళ్లకి చాలా కష్టం..నివేత పేతు రాజ్ కూడా సినిమాల్లో అవకాశాలు సంపాదించడం కోసం చాలా కష్టాలే పడింది. మిస్ ఇండియా కాంపిటీషన్ కి ముందు ఆమె చాలా సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చింది, కానీ ఒక్క సినిమాలో కూడా నటించే అవకాశం దక్కలేదు, ఎప్పుడైతే మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుందో అప్పటి నుండి ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
అవకాశాలు దాని అంతటా అవే వచ్చాయి. టాలీవుడ్ లోకి అడుగుపెట్టేముందు ఆమె తమిళంలో రెండు సినిమాల్లో నటించింది. ఆమె మొదటి చిత్రం ‘ఓరు నాల్ కూతు’..2016 వ సంవత్సరం లో వచ్చిన ఈ చిత్రంలో నివేత ఒక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తర్వాత ఉదయ్ నిధి స్టాలిన్ తో ‘పొడువగా ఎన్ మనసు తంగం’ అనే చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత సంవత్సరం శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘మెంటల్ మదిలో’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా ఫర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. నివేత పేతురాజ్ కి కూడా నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాతోనే ఆమె సైమా అవార్డ్స్ కి నామినేట్ అయ్యింది.. ఇక ఆ తర్వాత ఆమె తమిళంలో చేసిన ‘టిక్ టిక్ టిక్’ అనే చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది..దాంతో ఆమెకి తమిళం లో వరుసగా రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది.