News

చిన్న పిల్లాడి చేతిలో మోసపోయిన స్టార్ హీరోయిన్, ఆ పిల్లడు ఎలా చేసాడో తెలుసా..?

కొంతమంది ఒక్క సినిమాతో పాపులర్ అవుతుంటే మరికొంతమంది మాత్రం నటిగా తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అలాగే ఇతర బాషల నుంచి వచ్చి కూడా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న భామలు చాలా మందే ఉన్నారు అలాంటి వారిలో నివేదా పేతురాజ్ ఒకరు. అయితే తాను ఎనిమిదేళ్ళ బాలుడి చేతిలో మోసపోయానని హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌వాపోయారు. తన చేతిలో ఉన్న కరెన్సీని బలవంతంగా లాక్కొని పారిపోయాడన్నారు.

కోలీవుడ్‌లో యువనటి నివేదా పేతురాజ్‌ ‘ఒరునాల్‌ కూత్తు’, ‘పొదువాగ ఎన్‌మనసు’, ‘టిక్‌ టిక్‌ టిక్‌’ వంటి అనేక చిత్రాల్లో నటించిన ఆమె… ఇపుడు చెన్నై నగరంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అడయార్‌ ప్రాంతంలో ఒక బాలుడు చేతిలో మోసపోయినట్టు ఆమె వెల్లడించారు. విషయంలోకి వస్తే.. ‘అడయార్‌ సిగ్నెల్‌ వద్ద ఎనిమిదేళ్ళ బాలుడు డబ్బులు అడిగాడు. ఉచితంగా డబ్బులు ఇచ్చేందుకు నా మనసు అంగీకరించలేదు. దీంతో రూ. 50 విలువైన పుస్తకాన్ని కొనాలని చెప్పడంతో రూ. 100 నోటు తీయగా, ఆ బాలుడు రూ. 500 అడిగాడు. దీంతో పుస్తకాన్ని బాలుడికి తిరిగి ఇచ్చి, నేను ఇచ్చిన రూ.100 నోటు వెనక్కి తీసుకున్నాను.

అయితే, ఆ పిల్లవాడు పుస్తకాన్ని కారులో పడేసి… చేతిలోని రూ.వంద నోటు లాక్కొని పారిపోయాడు’ అని పేర్కొంది. ఇది చాలా సిగ్నల్స్ వద్ద జరుగుతున్న విషయమే. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఒకటి వైరల్ అవుతుంటుంది. వాటర్ బాటిల్స్ అమ్మే అతను.. ఒక కారు దగ్గర నిలబడి మూత తీయడానికి ప్రయత్నించగా.. ఆ మూత రాకపోవడంతో, కారులోని యువతి ఆ బాటిల్ తీసుకుని మూత తీసి సదరు వ్యక్తికి ఇవ్వబోగా.. రూ. 20 ఇవ్వాలని అతను చెప్పడంతో చేసేది లేక ఆమె రూ. 20 చెల్లించుకుంటుంది.

ఇలాంటి మోసాలు ప్రతి రోజూ చాలా అంటే చాలానే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నివేదా పేతురాజ్ కూడా అలాంటి మోసానికే గురయింది. నివేదా పేతురాజ్ విషయానికి వస్తే.. తెలుగు ప్రేక్షకులకూ ఆమె సుపరిచితమే. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో సుశాంత్‌కి లవర్‌గా ఆమె నటించింది. ‘మెంటల్ మదిలో, చిత్రలహరి, పాగల్, దాస్ కా ధమ్కీ’ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్‌లతో బిజీ నటిగా గడుపుతోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker