Health

నీలగిరి తైలం గురించి తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చి వాడుతారు.

నీలగిరి/యూకలిప్టస్ తైలం ఆవశ్యక నూనెలుకు చెందిన నూనె/తైలం.నీలగిరి తైలం లేదా యూకలిప్టస్ నూనె ఒక ఆవశ్యక నూనె. నీలగిరి తైలాన్ని యూకలిప్టస్ ఆకుల నుండి తీస్తారు.స్టీము డిస్టిలేసను పద్ధతిలో ఆకులనుండి ఉత్పత్తి చేస్తారు.ఈ నూనెను వైద్యపరంగా వాళ్ళునొప్పులు,తలనొప్పి,కీళ్ల నొప్పుల వంటి వాటికి మర్దన నూనెగా ఉపయోగిస్తారు. అయితే మ‌న‌కు క‌లిగే అనేక అనారోగ్యాల‌ను న‌యం చేసుకునేందుకు మ‌న‌కు అనేక ర‌కాల స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాలు ఔష‌ధాలుగా అందుబాటులో ఉన్నాయి. వాటిలో నీల‌గిరి తైలం కూడా ఒక‌టి. దీన్ని నీల‌గిరి చెట్ల నుంచి తీస్తారు. అయితే ఈ ఆయిల్ మ‌న‌కు అనేక లాభాల‌ను ఇస్తుంది.

దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. మొటిమ‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు వాటిపై నిత్యం రెండు పూటలా కొద్దిగా నీలగిరి తైలాన్ని రాయాలి. దీంతో అతి త‌క్కువ స‌మ‌యంలోనే మొటిమ‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇత‌ర మ‌చ్చ‌లు కూడా పోతాయి. దుస్తులు ఉతికేట‌ప్పుడు కొద్దిగా నీల‌గిరి తైలం వేసి వాటిని ఉత‌కాలి. దీంతో దుస్తుల‌కు ప‌ట్టి ఉండే ఫంగ‌స్‌, ఇత‌ర క్రిములు నశిస్తాయి. దీని వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. అలాగే బెడ్‌షీట్లు, దిండు క‌వ‌ర్లు త‌దిత‌ర ఇత‌ర వ‌స్త్రాల‌పై కూడా నీల‌గిరి తైలం చ‌ల్లుతుంటే అవి సువాస‌న వ‌స్తాయి.

అంతేకాకుండా క్రిములు రాకుండా ఉంటాయి. ఒక పాత్ర‌లో వేడి నీటిని తీసుకుని అందులో కొద్దిగా నీల‌గిరి తైలం వేసి ఆపైన వ‌చ్చే ఆవిరిని బాగా పీల్చాలి. ఇలా రోజుకు 2, 3 సార్లు చేస్తే ఎంత‌టి జ‌లుబైనా త్వ‌ర‌గా త‌గ్గుతుంది. అలాగే ద‌గ్గు, ముక్కు దిబ్బడ, ఫ్లూ జ్వ‌రం త‌దిత‌ర ఇత‌ర శ్వాస కోశ స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. శ‌రీరంలో నొప్పులు ఉన్న ప్ర‌దేశంలో నీల‌గిరి తైలం రాసి ఆయా భాగాల్లో వేడి నీటి కాప‌డం పెట్టాలి. దీంతో నొప్పుల నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ముఖ్యంగా ఇలా చేయ‌డం వ‌ల్ల కీళ్లు, కండ‌రాల నొప్పులు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. కొబ్బ‌రినూనెకు కొద్దిగా నీల‌గిరి తైలం క‌లిపి జుట్టుకు బాగా ప‌ట్టించాలి. త‌రువాత కొంత‌సేపు ఆగి త‌ల‌స్నానం చేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే చుండ్రు బాధ నుంచి విముక్తి ల‌భిస్తుంది.

అలాగే షాంపూలోనూ కొద్దిగా ఈ ఆయిల్ క‌లిపి త‌ల‌స్నానం చేసినా చుండ్రు నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. గోరు వెచ్చ‌ని నీరు కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా నీల‌గిరి తైలం వేసి బాగా క‌లిపి దాంతో నోరు పుక్కిలించాలి. రోజూ ఇలా చేయ‌డం వ‌ల్ల నోటి దుర్వాస‌న పోతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. నిత్యం ఆహారంలో నీల‌గిరి తైలం చేర్చి తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. నీల‌గిరి తైలంలో యాంటీ డ‌యాబెటిక్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ తైలాన్ని నిత్యం తీసుకుంటే ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker