రాత్రి వైఫై ఆపకుండానే నిద్రపోతున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసుకోండి.
మీ ఇంట్లో వైర్ లెస్ కనెక్షన్ వాడటంతో మీకు కూడా నెట్ యాక్సెస్ చేయడం అనేది చాలా ఈజీగా మారింది. అయితే దీని వలన నష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. అయితే మనం వాడుతున్న వైఫై ఫుల్ ఫాం చాలా మందికి తెలియదు. వైర్‌లెస్ ఫిడెలిటీ. దీనిని మొదటిసారి 1971లో ప్రయోగాత్మకంగా అమెరికన్లు ప్రారంభించారు.
అమెరికాకు చెందిన అలోహనెట్ అనే కంపెనీ యూహెచ్ఎఫ్ వైర్‌లెస్ పాకెట్ ద్వారా గ్రేట్ హవాయియన్ ద్వీపాలను కలిపేందుకు ఇది ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఇదే తొలి వైర్ లెస్ కనెక్షన్ అని చెప్పవచ్చు. కానీ టెక్నికల్‌గా ఈ పదాన్ని మాత్రం వైఫై 1991లో నెదర్లాండ్స్‌లో ఉపయోగించారు. నైట్ వైఫై ఆపకపోతే ఏం జరుగుతుంది..
నైట్ వైఫై ఆపకపోతే.. అదే డిమ్ లైట్‌లో మొబైల్, ల్యాప్‌టాప్‌లను నిరంతరంగా నడపడం వల్ల కంటి చూపుపై ప్రభావం పడుతోంది. దీని కారణంగా కళ్లలో మంట, కొన్నిసార్లు వాపు సమస్య ఉంటుంది. Wi-Fi వేవ్స్, ఇంటర్నెట్ అధిక వినియోగం కూడా నిద్రను ప్రభావితం చేస్తుంది. దీంతో చాలా మందిలో నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్నట్లు వైద్యులు అంటున్నారు. వైప్ వేవ్స్ వల్ల చిరాకు పెరుగుతుంది. మానసికంగా ప్రభావితం చేస్తాయి.
ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ప్రజల జ్ఞాపకశక్తిపై చెడు ప్రభావం పడుతోంది. దీనివల్ల అల్జీమర్స్ సమస్య వచ్చే అవకాశం ఉందట.. అంటే మతిమరుపు ఎక్కువవుతుందనమాట. ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ప్రజలు శారీరక శ్రమను తగ్గించుకోవడం ప్రారంభించారు. దీని వల్ల ఊబకాయం సమస్య కూడా కనిపిస్తోంది.