Health

పడుకునే ముందు ఇలా చేస్తే చిటికెలో నిద్రపోతారు.

నిద్రపోయే సమయానికి కనీసం రెండు మూడు గంటల ముందే రాత్రి భోజనాన్ని ముగించడమనేది ఆరోగ్యకరమైన అలవాటు. కొన్ని సార్లు ఇలా ముందుగా ఆహారం తీసుకోవడం వల్ల నిద్రవేళకు ఆకలి అనిపించవచ్చు. అటువంటప్పుడు కొద్దిగా పండ్లు లేదా పాలు తీసుకుని నిద్రపోవడం కొంత మందికి అలవాటు. అయితే పడుకునే ముందు నాటు ఆవునెయ్యి గోరువెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి. నిద్ర రావడానికి కూడా ఓ చక్కని టీ వచ్చింది. అదే బనానా టీ. అరటిపండుతో ఈజీగా చేసుకొనే ఈ టీని రాత్రి పడుకునే ముందు తాగితే చాలు.. మీరు కంటినిండా నిద్ర పోవచ్చు.

గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి. ముందుగా ప్రశాంతంగా ఉండేలా మీ బెడ్ రూంలో ఏర్పాట్లు చేసుకోవాలి. బెడ్ షీట్లు, దిండు, బెడ్ రూం లైటింగ్, దుప్పట్లు లాంటివి మీకు అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. చేతివేళ్లతో లేదా దువ్వెనతో తలవెంట్రుకలను మృదువుగా దువ్వుకుంటూ ఉండాలి. నిద్రపోయే ముందు సిగిరేట్ తాగడం, టీ, కాఫీ తాగకూడదు. కెఫిన్ పదార్థాలు నిద్రను దూరం చేస్తాయని.. సాధ్యమైనంతవరకూ వాటికి దూరంగా ఉండాలి. చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకోవాలి.

రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి. రాత్రి పూట కాసిని గోరువెచ్చని పాలు తాగాలి. వ్యాయామం, యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి చేయాలి. దీంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా నిద్రపడుతుంది. చిలకడదుంపలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిలోని న్యూట్రిన్స్.. ప్రశాంతంగా నిద్రపట్టడానికి కారణమౌతాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు వీటిని తినడం మంచిది. నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్‌ ఫోన్‌ చూడటం మానేయాలి. అంతేకాదు, రాత్రిళ్లు తల పక్కన మొబైల్‌ పెట్టుకుంటే రేడియేషన్‌ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు.

కాబట్టి మొబైల్‌ను దూరంగా పెట్టడం మంచిది. రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి లేదా ఏవైనా సుందర దృశ్యాలను ఊహించుకోవాలి. చమేలీ టీకి.. బెడ్ టైమ్ డ్రింక్ గా మంచి పేరు ఉంది. ఇది యాంక్సైటీని తగ్గించి.. ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయం చేస్తుంది. చాలా మంది పడుకునే ముందు టీ, గ్రీన్ టీ లాంటివి తాగుతుంటారు. దానికి బదులు ఈ చమేలీ టీ తాగడం వల్ల ప్రశాంతగా నిద్రపడుతుందట. ఓంకారం లేదా మృదువైన లలిత సంగీతాన్ని పెట్టుకొని ప్రశాంతంగా కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే తొందరగా నిద్ర పడుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker