రాత్రి పడుకునేటప్పుడు మొబైల్ ఫోన్ పక్కనే తల పక్కనే పెట్టుకుంటున్నారా..? అది ఎంత ప్రమాదమంటే..?
రాత్రి పడుకునేటప్పుడు మొబైల్ ఫోన్ పక్కనే తల పక్కనే ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన అలవాటు కాదని వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. పరికరంతో నిద్రపోవడం హానికరమైన అలవాటు అని, ఇది నిద్ర లేమి మరియు ఇతర వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు చెప్పారు. 2020 అధ్యయనం ప్రకారం, నిద్రపోయే ముందు ఫోన్ వాడకాన్ని నాలుగు వారాల పాటు తగ్గించడం వల్ల నిద్ర నాణ్యత ,వ్యవధి ,పని చేసే సామర్థ్యం మెరుగుపడతాయి.
అయితే ప్రస్తుత జీవనశైలి కారణంగా మొబైల్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లకు బానిసలవుతున్నారు. ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడటంతో రోజును ప్రారంభించి తినేటప్పుడు, పడుకునేటప్పుడు సైతం ఫోన్‌ని వదిలిపెట్టడం లేదు. యువత మొబైల్ ఫోన్లకు బానిసలు కావడంలో తప్పులేదు. కానీ ఈ రకమైన అలవాటు చాలా ప్రమాదకరం.
కొంతమందికి మొబైల్ ఫోన్‌ని దిండు కింద పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల భారీ నష్టం చవిచూడవల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. నిద్రపోతున్నప్పుడు మొబైల్‌ని ఎంత దూరంలో ఉండాలి అనే విషయం చాలా మందికి తెలియదు. దగ్గరలో మొబైల్ ఫోన్లు పెట్టుకుని నిద్రించే వారు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. దీనిపై WHO కూడా హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం ప్రకారం..
90 శాతం మంది యువకులు, 68 శాతం మంది పెద్దలు నిద్రించే సమయంలో తమ దిండు కింద మొబైల్ ఫోన్ పెట్టుకుని నిద్రపోతున్నారు. మొబైల్ ఫోన్‌ని దిండు కింద పెట్టుకుని పడుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఆరోగ్యానికి ప్రమాదకరం. అందుకే నిద్రపోయేటప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను దూరంగా ఉంచడం మంచిది. వీలైతే, నిద్రపోయేటప్పుడు మొబైల్ ఫోన్‌లను కనీసం 3 అడుగుల దూరంలో ఉంచడానికి ప్రయత్నించండి.
దీని వల్ల మొబైల్ విడుదల చేసే రేడియో ఫ్రీక్వెన్సీ విద్యుదయస్కాంత శక్తిని తగ్గుతుంది. మొబైల్ ఫోన్‌లను పక్కన పెట్టుకుని పడుకోవడం వల్ల కలిగే మరో ప్రమాదం ఏంటంటే.. మొబైల్ ఫోన్లు విడుదల చేసే రేడియేషన్ వల్ల కండరాల నొప్పులు, తలనొప్పికి దారితీస్తుంది. మొబైల్ ఫోన్‌ల నుంచ్చే వచ్చే నీలి కాంతి నిద్రను ప్రేరేపించే హార్మోన్లను దెబ్బతీస్తుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది.