రాత్రిళ్లు నిద్ర పట్టట్లేదా..? ఈ నీళ్లు తాగితే హాయిగా పడుకోవచ్చు.
ప్రస్తుతం అందరికి ప్రశాంతత కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టనివారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి కి గురి అవుతుంటారు. అయితే చలికాలంలో వాము తినడం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. చలికాలంలో ప్రధానంగా కన్పించే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల్నించి విముక్తి పొందవచ్చు.
వాము వేసవి కంటే చలికాలంలో తీసుకోవడమే అత్యుత్తమం. ఎందుకంటే వాము వేడిచేస్తుంది. అందుకే చలికాలంలో తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమౌతాయి. అయితే నిర్ణీత మోతాదు దాటకూడదు. గోరువెచ్చని నీళ్లలో వాము పౌడర్ ప్రయోజనాలు.. కడుపు సమస్యల్నించి ఉపశమనం.. రోజూ రాత్రివేళ గోరువెచ్చని నీటిలో వాము పౌడర్ కలుపుకుని తాగితే కడుపుకు సంబంధించిన సమస్యలు దూరమౌతాయి.
గ్యాస్, అజీర్తి సమస్యలు తొలగిపోతాయి. రోజూ వాము పౌడర్ కలుపుకుని తాగుతుంటే..కడుపు సంబంధిత సమస్యలన్నీ దూరమౌతాయి. ఆకలి.. చాలామందికి ఆకలేయకపోవడం అనేది ఓ ప్రధాన సమస్య. ఈ సమస్యకు వాము మంచి ప్రత్యామ్నాయం. నీళ్లలో వామ పౌడర్ కలుపుకుని తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. రోజూ రాత్రి వేళ తాగడం వల్ల ఆకలి కూడా పెరుగుతుంది.
ఇటీవలి కాలంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఎందుకంటే చాలామంది ఒత్తిడి, ఆందోళనలతో ఇబ్బంది పడుతుంటారు. ఫలితంగా నిద్ర సమస్య ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో రాత్రి సమయంలో నిద్ర సరిగ్గా పట్టదు. గోరువెచ్చని నీళ్లలో వాము పౌడర్ కలుపుకుని తాగడం వల్ల మస్తిష్కం ప్రశాంతమై..రాత్రంతా మంచి నిద్రపడుతుంది. వాము పౌడర్ చేసుకుని నిల్వ ఉంచుకోవాలి. ప్రతిరోజూ రాత్రి సమయంలో ఓ గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో వాము పౌడర్ ఒక స్పూన్ కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి.