Health

సులభంగా బరువు తగ్గాలని రాత్రివేళ రాగి రొట్టె, జొన్న రొట్టె తింటున్నారా..?

హైదరాబాద్‌లో ఇపుడు ఏ గల్లీ చూసినా తోపుడు బండ్లు, వాటి మీద కట్టెల పొయ్యి , రెండు చేతుల నడుమ పిండి ముద్ద ఉంచి అందంగా రొట్టెలను చేస్తోన్న మహిళలు హైదరాబాద్ నగరంలో విరివిగా కనబడుతున్నారు. ఇక చపాతీ, రోటీ ఏదైనా తక్కువ కాలంలోనే తినేయాలి. లేదంటే అవి పాడైపోయే అవకాశాలున్నాయి. అయితే బరువు తగ్గించే రాగి రొట్టె.. రాగిలో ఫైబర్, ప్రొటీన్స్ అత్యధికంగా ఉంటాయి. దీని వలన ఈజీగా బరువు తగ్గుతారు. 100 గ్రాముల రాగిపిండిలో 13 గ్రాముల ప్రోటీన్‌ ఉంటుంది. ఈ రొట్టెను డైలీ తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు.

బ‌రువును త‌గ్గించ‌డంలో రాగులు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. హైబీపీని, షుగ‌ర్ ను త‌గ్గిస్తాయి. ర‌క్త హీన‌త‌ను త‌గ్గిస్తుంది. ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంలో రాగులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అజీర్తి స‌మ‌స్య‌ను త‌గ్గిస్తాయి. రాగుల‌తో జావ‌, ఉప్మా, ఇడ్లీ, దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తీసుకోవచ్చు. రాగిరోట్టె తయారీ.. రాగి పిండి ఒక క‌ప్పు, నూనె ఒక టేబుల్ స్పూన్‌, ఆవాలు పావు టీ స్పూన్‌, జీల‌క‌ర్ర అర టీ స్పూన్‌, స‌న్న‌గా త‌రిగిన ప‌చ్చి మిర్చి ముక్క‌లు ఒక టేబుల్ స్పూన్, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్కలు పావు క‌ప్పు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్స్‌, స‌న్న‌గా త‌రిగిన క‌రివేపాకు కొద్దిగా, త‌రిగిన కొత్తిమీర అర‌ క‌ప్పు, ప‌సుపు పావు టీ స్పూన్‌, ఉప్పు రుచికి స‌రిప‌డా, గోరు వెచ్చ‌ని నీళ్లు త‌గిన‌న్నితీసుకోవాలి.

రాగి పిండిని బాగా క‌లిపిన త‌రువాత చేతిలోకి కొద్దిగా నూనెను తీసుకుని,క‌లిపిన పిండిని ముద్ద‌గా చేసి ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు బ‌ట‌ర్ పేప‌ర్ పై కొద్దిగా నూనె రాసి, కావ‌ల‌సిన ప‌రిమాణంలో ముందుగా క‌లిపి పెట్టుకున్న పిండిని తీసుకుని చేత్తో నొక్కుతూ రోటీలా చేసుకోవాలి. రోటీ చేసేట‌ప్పుడు చేతికి పిండి అంటుకు పోకుండా నూనెను కానీ నీటిని కానీ ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇలా చేసిన రోటీని పెనంపై వేసి నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ రోటీలో కొత్తిమీర‌కు బ‌దులుగా మెంతి కూర‌, పాల కూర‌, తోట కూర‌ను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. బరువు తగ్గించే జొన్న రొట్టె.. జొన్న రొట్టెలు చాలా బలవర్ధకమైన ఆహారం. ఎముక పుష్టి కూడా ఉంటుంది. జొన్న రొట్టెలు, జొన్న పిండితో చేసిన ఇతర వంటకాలు సులభంగా అరుగుతాయి.

దాని వల్ల బరువు పెరగకుండా ఉంటారని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఇందులో గ్లూటెన్ ఉండదు. ఫైబర్ అధికంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ బీ3 ఉండడం వల్ల ఎముకలు బలపడతాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. జీవక్రియను పెంచి మలబద్దకాన్ని దూరం చేస్తుంది. రక్త ప్రసరణ పనితీరును మెరుగుపరుస్తుంది. జొన్న రొట్టెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల. వాటిలో ఉండే ఫైబర్ అద‌నంగా పెరిగిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను క‌రిగించేస్తుంది. అదే స‌మ‌యంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

జొన్న రొట్టె తయారీ.. జొన్నలతో సులభంగా అయ్యే వంట జొన్నరొట్టెలు. జొన్న రొట్టెల తయారీకి కావాల్సిన పదార్థాలు రెండు కప్పుల జొన్న పిండి, సరిపడా నీళ్లు తీసుకోవాలి. ముందుగా జొన్న పిండి బౌల్‌లోకి తీసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకోవాలి. ముద్దలా కలిపిన వాటిని బాల్స్‌గా చేసుకోవాలి. ఆ బాల్స్‌ను కాటన్‌ క్లాత్‌పై పెట్టి, రోటీ తరహాలో పలుచగా అయ్యేలా చేత్తో నొక్కాలి. మరీ పలుచగా, మరీ దలసరిగా కాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత స్టవ్‌పై పెనం ఉంచి కాల్చుకోవాలి. నచ్చిన కూర, చట్నీతో ఈ రొట్టెలను తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker