Health

రాత్రి కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా..? అయితే మీకు తొందరలోనే..?

కొంతమందికి కలలు మంచిగా వస్తే, మరి కొంతమందికి చెడుగా వస్తాయి. ఇంకొంతమందికి ఏమో దెయ్యాలు,భూతాలు కలలోకి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే చాలామంది అంటుంటారు కదా! కల అనేది కేవలం భ్రమ మాత్రమే అని. మనం రోజంతా ఏవైతే ఊహించుకుంటామో?, అంతేకాకుండా రోజంతా ఏవేవి చూస్తామో? అవే రాత్రి కలలోకి వస్తుంటాయని మరి కొంతమంది అంటుంటారు. అయితే క‌ల‌లో క‌నిపించేవి నిజ జీవితంలోనూ జ‌రుగుతాయి.

అని న‌మ్మేవారు కొంద‌రు ఉంటారు. అలా కొంద‌రికి జ‌రుగుతూ ఉంటుంది కూడా. అది యాదృచ్ఛిక‌మే. అంతేకానీ.. క‌ల‌లో క‌నిపించేవి.. నిజ జీవితంలోనూ జ‌రుగుతాయ‌ని క‌చ్చితంగా చెప్ప‌లేం. ఇక కొంద‌రిని దెయ్యాలు త‌రుముతున్న‌ట్లు క‌ల‌లు వ‌స్తుంటాయి. దీనికి నిపుణులు చెబుతున్న అర్థం ఏమిటంటే.. మీకు దెయ్యాలు అంటే భ‌యం ఉన్నా.. లేదా దెయ్యాల‌కు చెందిన సినిమాలు చూసినా, క‌థ‌లు విన్నా.. మీకు స‌హ‌జంగానే క‌ల‌లో దెయ్యాలు క‌నిపిస్తాయి. అయితే దెయ్యాలు అంటే మీకు భ‌యం ఉంటే అవి మిమ్మ‌ల్ని త‌రిమిన‌ట్లు క‌ల‌లు వ‌స్తాయి.

ఇందులో భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఇలాంటి క‌ల‌లు తాత్కాలిక‌మే. అప్ప‌టిక‌ప్పుడే ఇలాంటి క‌లలు వ‌స్తాయి. త‌ర‌చూ రావు. అందువ‌ల్ల ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. ఇక కొంద‌రు ఎల్ల‌ప్పుడూ అభ‌ద్ర‌తా భావంతో ఉంటారు. తాము ఏదో కోల్పోయామ‌ని ఫీల‌వుతుంటారు. ఇలాంటి వారికి కూడా క‌ల‌లో దెయ్యాలు త‌రిమిన‌ట్లు అనిపిస్తుంది. ఇలాంటి వారు అయితే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డే ప్ర‌య‌త్నం చేయాలి. లేదంటే త‌ర‌చూ ఇలాంటి క‌ల‌లే వ‌స్తూ ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి.

ఇక కొంద‌రికి క‌ల‌లో చ‌నిపోయిన త‌మ వాళ్లు క‌నిపిస్తారు. ఇటీవ‌లే త‌మ కుటుంబ స‌భ్యులు లేదా స‌న్నిహితులు లేదా బంధువుల్లో ఎవ‌రైనా ద‌గ్గ‌రివారు చ‌నిపోతే.. వారితో అనుబంధం ఎక్కువ‌గా ఉంటే.. అలాంటి వారు క‌ల‌లో క‌నిపిస్తారు. ఇది కూడా యాదృచ్ఛిక‌మే. కొంత కాలానికి ఇలాంటి క‌ల‌లు త‌గ్గిపోతాయి. ఎప్పుడో ఒక‌సారి ఇలాంటి క‌ల‌లు వ‌స్తాయి. క‌నుక వీటి గురించి పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన‌, ఆలోచించాల్సిన ప‌నిలేదు.

స‌మ‌స్య‌లు చాలా ఎక్కువ‌గా ఉన్న‌వారికి కూడా ఇలా అప్పుడ‌ప్పుడు క‌ల‌లో దెయ్యాలు త‌రిమిన‌ట్లు అనిపిస్తుంది. అంటే అనేక స‌మ‌స్య‌లు చుట్టు ముట్టి ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయ‌ని అర్థం. ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డితే ఇలాంటి క‌ల‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. క‌ల‌లో దెయ్యాలు క‌నిపించ‌డం అన్న‌ది స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం. ఇత‌ర క‌ల‌ల మాదిరిగానే ఈ క‌ల‌లు కూడా వ‌స్తుంటాయి. క‌నుక క‌ల‌లో దెయ్యాలు క‌నిపించ‌గానే ఆందోళన చెందాల్సిన ప‌నిలేదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker