రాత్రి పూట ఈ పండ్లు తింటే ఎంత ప్రమాదమో తెలుసుకోండి.
పండ్లు చెట్టు నుంచి వచ్చు తిను పదార్దములు. రకరకాల పండ్లు వివిధ రుచులలో మనకు ప్రకృతిలో లభిస్తున్నాయి. ఆవృత బీజ మొక్కలలో ఫలదీకరణం తర్వాత అండాశయం ఫలంగాను, అండాలు విత్తనాలుగాను అభివృద్ధి చెందుతాయి. ఫలం లోపల విత్తనాలు ఏర్పడడం ఆవృతబీజాల ముఖ్య లక్షణం. ఇలా ఫలాలు ఏర్పడడానికి కొన్ని వారాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు పడుతుంది. అయితే అనారోగ్యంతో ఉన్నవారిని వైద్యులు పండ్లను తినమని సలహా ఇస్తారు.
పండును సమయానికి అనుగుణంగా మాత్రమే తినాలని లేకుంటే అవి మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట పండ్లను తీనడం వల్ల ఆరోగ్యానికి సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు రాత్రిపూట పండ్లను తీనవొద్దని వైద్యులు పేర్కొన్నారు. రాత్రిపూట తినకూడని పండ్లలో అరటిపండు ఒకటి.
రాత్రి సమయంలో అరటిపండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది వ్యాయామం తర్వాత సాయంత్రం అరటిపండ్లను తీంటూ ఉంటారు. అయితే దీనిని తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెంచుతుందని వైద్యులు తెలిపారు. దానివల్ల నిద్ర సమయంలో సమస్యలు వస్తాయని అంటున్నారు. అందుకే అరటిపండును రాత్రిపూట అస్సలు తినకూడదని తెలుపుతున్నారు.
ప్రతి వైద్యుడు ఆపిల్ పండ్లను తినమని సలహా ఇస్తారు. రోజూ సేపులను తీనడం వల్ల శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా మంచి లాభాలను ఇస్తుంది. అయితే ఈ పండును రాత్రి పూట తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ రాత్రి పూట సేపును తీంటే సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందంటున్నారు. ఇది జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుందని తెలుపుతున్నారు. కావున రాత్రి పూట దీనిని తీసుకోక పోవడమే మేలంటున్నారు.
రాత్రిపూట సపోటాని కూడా తినోద్దని వైద్యులు తెలుపుతున్నారు. ఇందులో చక్కెర పరిమాణం అధికంగా ఉన్నందున శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. దీని కారణంగా నిద్రపోవడంలో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి రాత్రిపూట దీనిని తినోద్దని వైద్యులు తెలిపారు.