రాత్రి వేళా తలస్నానం చేస్తున్నారా..? మీకు అసలు విషయం తెలిస్తే..?
ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం చేస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ తలస్నానం చేస్తే శాస్త్రం ప్రకారం కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే తలస్నానమనేది కేవలం వీలు లేదా అవసరమైనప్పడు చేసేది కాదు. అయితే నిద్రపోయే ముందు ధ్యానం, యోగా, మానసిక వ్యాయామం చేయడం సర్వసాధారణం. నిద్రపోయే ముందు స్నానం చేయడం కూడా ట్రెండ్‌లో ఉంది.
అయితే, నిద్రపోయే ముందు తలస్నానం చేయడం సరైందా? కాదా? అన్న ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతుంటుంది. ఈ గందరగోళాన్ని ఇవాళ మనం క్లియర్ చేసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరూ రోజు ప్రారంభంలో స్నానం చేయడానికి శ్రద్ధ చూపుతారు. ఇంకొంత మంది రాత్రి పడుకునే ముందు కూడా స్నానం చేసి పడుకుంటారు. అయితే నిద్రపోయే ముందు తలస్నానం చేయడం వల్ల అలసట చాలా వరకు దూరం అవుతుంది.
నిద్రకు ముందు స్నానం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఫలితంగా మరుసటి రోజంతా శరీరం ఎంతో తాజాగా, ఉత్సాహంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు తలస్నానం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరం రిలాక్స్‌గా ఉంటుంది. సిరల్లో రక్త ప్రవాహం మెరుగవుతుంది. స్నానం చేయడం ద్వారా వ్యక్తి శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా మంచి అనుభూతి చెందుతాడు.
అంతే కాదు.. చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా మారుతాయి. ఎందుకంటే శరరీం, జుట్టుపై రోజంతా పేరుకుపోయిన మురికి సులభంగా తొలగిపోతుంది. వేడి లేదా చల్లటి నీటితో స్నానం చేయడం అనేది ఎవరి ఇష్టం వారిది. అయినప్పటికీ.. కొంచెం గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఇది కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది. చర్మంపై రంధ్రాలను తెరుస్తుంది. మంచి నిద్ర పడుతుంది.