Health

ఈ ప్రపంచాన్ని నాశనం చేసే కొత్త మహమ్మారి రాబోతుంది. అదేంటో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా కొత్త కోవిడ్-19 జాతులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఎరిస్ జాతి బ్రిటన్‌తో పాటు కొన్ని యూరోపియన్ దేశాలలో సాధారణమైంది. ఇప్పుడు మరొక కొత్త జాతి కనుగొనబడింది. అయితే ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు 25 రకాల వైరస్ కుటుంబాల గురించి తెలుసుకున్నారు. వాటిలో ప్రతి ఒక్కటి వందలు లేదా వేల మ్యూటేషన్ ని కలిగి ఉన్నాయి. వీటిలో ఏదైనా కూడా మహమ్మారిని కలిగించే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు.

కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 మిలియన్ల మందిని చంపింది. అదృష్టవశాత్తు వైరస్ సోకిన వారిలో ఎక్కువ మంది కోలుకోగలిగారు. ఎబోలా మరణాల రేటు 67 శాతంగా ఉంది. తర్వాత బర్డ్ ఫ్లూ 60 శాతం వచ్చింది. మెర్స్ కూడా 34 శాతం వరకి ప్రజలకి సోకింది. అందుకే కొత్తగా వచ్చే తదుపరి మహమ్మారి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమేనని నిపుణులు తెలిపారు.

అయితే డబ్యూహెచ్ఓ కి చెందిన నిపుణులు మెక్ కాలీ మాట్లాడుతూ తదుపరి మహమ్మారికి కారణమయ్యేది భయంకరమైన స్పానిష్ ఫ్లూ లాంటిది కావచ్చని హెచ్చరించారు. కోవిడ్ వ్యాప్తి చెందినప్పటి నుంచి శాస్త్రవేత్తలు తదుపరి మహమ్మారికీ కారణమయ్యే ఇతర ప్రమాదకరమైన వైరస్ కోసం శోధిస్తున్నారు. ఇది స్పానిష్ ఫ్లూ మాదిరిగా కేసుల పెరుగుదల, మరణాల సంఖ్య ఉండవచ్చని భావిస్తున్నారు. స్పానిష్ ఫ్లూ అనేది 1918 లో వచ్చింది. ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మందికి సోకింది. పక్షుల నుంచి వచ్చిందని అంటారు.

1918 నుంచి 1919 వరకు 50 మిలియన్ల మంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య కంటే ఈ వైరస్ వల్ల చనిపోయిన వాళ్ళే సంఖ్య రెండు రేట్లు ఎక్కువ. అడవి, పెంపుడు పక్షుల నుంచి ఉద్భవించిందని కొందరు వాదిస్తారు. మరికొందరు పందుల నుంచి వచ్చిందని చెప్తారు. చైనా, ఫ్రాన్స్, యూఎస్, బ్రిటన్ సహ అన్నీ ప్రాంతాలని ఇది కబళించింది.

కరోనా వైరస్ మాదిరిగా కాకుండా స్పానిష్ ఫ్లూ యువతలో ముఖ్యంగా ఐదు కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలలో, 20-40 సంవత్సరాల వయసు వారికి సోకింది. ఇది అత్యంత శక్తివంతమైనది. వ్యాధి లక్షణాలు కనిపించిన 24 గంటల్లోపే ఆరోగ్యంగా ఉన్న రోగి ప్రాణాలు కూడా తీసేస్తుంది. న్యుమోనియా, శరీరం మీద బొబ్బలు, ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఊపిరితిత్తులు పని చేయడం ఆగిపోతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker