ఈ గింజల పొడిని నీటిలో కలుపుకుని తాగితే ఎంతటి రోగానైనా నయం అవుతుంది.
నేరేడులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు, గుండె ఆరోగ్యానికి రక్షగా నిలుస్తాయి. రక్తక్యాన్సర్ కారకాలను కూడా నిరోధిస్తాయి. అధిక జ్వర బాధితులు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. యూరినల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే.. నిమ్మ, నేరేడు రసాన్ని రెండేసి చెంచాల చొప్పున నీటిలో కలిపి తీసుకుంటే ఉపశమనం వుంటుంది. అయితే ఈ వ్యాధులతో బాధపడుతున్నవారు నియంత్రించుకోవడానికి వివిధ రకాల వ్యాయామాలు చేస్తున్నారు.
ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నేరేడు పండు గింజలను వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. నేరేగు గింజల ప్రయోజనాలు..ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది చెడు ఆహారపు అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల మధుమేహం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి జామున్ గింజల పొడిని వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పొడిని క్రమం తప్పకుండా మధుమేహం ఉన్నవారు వినియోగిస్తే సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గుతాయి. పొట్ట సమస్యల నుంచి ఉపశమనం..ఈ గింజల పొడిలో ఫైబర్, కొవ్వు, ప్రోటీన్, ఖనిజాలు, విటమిన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో పీచు పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి దీనిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా పొట్ట సమస్యలన్నీ సులభంగా తగ్గతుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి.. నేరేడు పండు గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఇవి శరీరం నుంచి ఫ్రీ రాడికల్స్‌ను సులభంగా తొలగిస్తాయి. దీంతో శరీరం డిటాక్సిఫై అవుతుంది. అయితే ఇందులో ఉండే గుణాలు శరీర రోగనిరోధక శక్తిని వేగంగా పెంచడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా బీపీ సమస్యలతో బాధపడుతున్నవారికి ఔషధంలా పని చేస్తుంది.