Health

నేరేడు పండ్లు మగవారికి ఓ వరం, ఆ విషయం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.

ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే నేరేడు పండ్లను ఇండియన్ బ్లాక్ బెర్రీ లేదా జామూన్ అంటారు.

వేసవి కాలం ముగుస్తున్న సమయంలో… ఈ పండ్లు మార్కెట్‌లో లభిస్తాయి. జావా ప్లమ్ అని కూడా పిలిచే ఈ పండ్లలో ఔషధ గుణాలు ఎక్కువే. చాలా రకాల వ్యాధుల్ని కూడా ఇవి తగ్గిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండేలా చేస్తాయి. ఈ సీజన్‌లో మార్కెట్లో నేరేడు పళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయ్. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నేరేడు పండు మాత్రమే కాదు… దాని ఆకులు కూడా రకరకాల వ్యాధుల్ని తరిమేస్తాయి.

గుండె ఆరోగ్యం పదిలం.. నేరేడు పండ్లు గుండెకు చాలా మంచివి. ఈ పండ్లు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఇది గుండె పోటు అవకాశాల్ని చాలా వరుకు తగ్గిస్తోంది. ఉదర సమస్యకు మేలు.. నేరేడు పళ్లలో విటమిన్‌ బి, ఐరన్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి సంబంధించిన అనేక సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. పొట్టకు సంబంధించిన ఎలాంటి సమస్యనైనా దూరం చేసుకోవచ్చు.

ఈ సీజన్‌లో వీలైనంత ఎక్కువగా తింటే మంచిది. షుగర్ షేషంట్లకు మంచిది.. డయాబెటిక్ పేషెంట్లు వీటిని తప్పకుండా తినాలి. ఇవి రక్తంలో చక్కెరను స్తాయిని పెంచదు. ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మధుమేహ తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులు వైద్యుడిని సంప్రదించిన తర్వాత తీసుకుంటే మంచిది. అలాగే, నేరడు విత్తనాలు ఎండబెట్టి.. పొడి చేసుకుని తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ ఉంటాయ్.

స్పెర్మ్ కౌంట్.. వైవాహిక జీవితంలో మగవాళ్లకు ప్రధాన సమస్య స్పెర్మ్ కౌంట్. అలాంటి వారికి నేరేడు పండ్లు చాలా ఉపయోగపడతాయ్. నేరేడు పండ్లు స్పెర్మ్ కౌంట్ పెంచడంతో తోడ్పడుతాయ్. దీంతో, వారి వైవాహిక జీవితంలో సమస్యలు తొలిగిపోతాయ్. ఇమ్యూనిటీ పెరగడం.. ఈ కాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. నేరేడు పళ్లు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే కచ్చితంగా వీటిని తినాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker