News

తనకు జరిగిన అవమానాలను చెప్తూ తొలిసారి కన్నీరు పెట్టిన నెల్లూరు నీరజ.

నెల్లూరు నీరజ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. చిన్న చిన్న వెబ్ సిరీస్ లలో, షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు నెల్లూరు నీరజ. ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీకి వచ్చారు నెల్లూరు నీరజ. ఈ క్రమంలోనే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. షార్ట్ ఫిలిమ్స్ లో , వెబ్ సిరీస్ లలో కామెడీ పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహరా తో కలిసి పలు కామెడీ షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించి నవ్వించారు.

అయితే హాయ్ అండీ.. నమస్తే.. నేను మీ నెల్లూరు నీరజని. ఈ రోజు మీతో నా ఎమోషన్ షేర్ చేసుకోవాలనిపించింది. 13 సంవత్సరాలు అయ్యింది నేను ఇండస్ట్రీలోకి వచ్చి. ఈ 13 ఏళ్లల్లో మాగ్జిమమ్ అన్ని షోలు చేశాను. బుల్లితెరపై అన్ని కామెడీ షోలు చేసుంటాను. యూట్యూబ్‌లో కూడా సీరియల్స్, వెబ్ సిరీస్‌లు చేశాను. కానీ చిన్న వెలితి ఉండిపోయింది. ఏంటీ వెండితెరపై కనిపించకుండా చనిపోతానా అని. చిన్న చిన్న సినిమాలు చేశాను..కానీ అవి చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు కావవి. కానీ ఇప్పుడు సిద్దు హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్‌లో ఆయనకు మేనత్తగా చేశాను.

ట్రైలర్ లో నన్ను నేను చూసుకునే సరికి.. 13 ఏళ్ల కష్టం.. ఎలా వెళ్లిపోయింది.. అలా వెళ్లిపోయింది’ అంటూ కన్నీటి పర్యంతమయ్యింది నీరజ. ఎన్ని అవమానాలు పడ్డానో. అవుడేటెడ్ కామెడీ అంటూ ఎగతాళి చేశారు. నీ పని అయిపోయిందంటూ కామెంట్స్ కూడా చేశారు. కానీ ఈ రోజు సిద్దు సినిమాలో కనిపించాను. ఇదంతా హీరో సిద్దు వల్లే సాధ్యమైంది. థాంక్యూ సిద్దు సార్’ అంటూ ఏడ్చేశారు నెల్లూరు నీరజ. దీంతో నెటిజన్లు మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందంటూ కామెంట్స్ చేశారు.

కాగా, సిద్దు, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ ట్రైలర్ రాగా, ట్రెమండస్ రెస్సాన్స్ వచ్చింది. అందులో ట్రయల్ రాగానే.. ముందుగా నెల్లూరు నీరజ.. కనిపిస్తుంది. ఇందులో గుర్తింపు ఉన్న పాత్ర దక్కడంతో ఆమెకు తన ఆనందాన్ని కన్నీటి రూపంలో వ్యక్తం చేస్తూ.. తాను పడ్డ కష్టానికి దక్కిన ప్రతి ఫలంగా భావిస్తూ.. ఆనంద భాష్పాలను రాల్చింది ఆవిడ. ఇక ఈ మూవీ మార్చి 29న రిలీజ్ కాబోతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker