నీతా అంబానీ వాడే మొబైల్ ఫోన్ అసలు ధర ఎంతో తెలుసా..?
ముకేశ్ అంబానీ ఎంత పాపులరో.. ఆయన సతీమణి నీతా అంబానీ కూడా అంతే పాపులర్. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ మరియు వ్యవస్థాపకురాలు, ముంబై ఇండియన్స్ అధినేత, దేశంలోనే అత్యంత సంపన్న మహిళ అయిన నీతా అంబానీ తరచూ తన లగ్జరీ లైఫ్ స్టైల్‌తో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే ముకేష్ అంబానీకి ప్రపంచంలోనే ఎవరూ పొందలేనన్ని సకల సౌకర్యాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో భాగంగా లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్‌లు, ఖరీదైన భవనాలు లెక్కలెనన్నీ ఉన్నాయి.
ముఖేష్ అంబానీలాగే అతని భార్య నీతా అంబానీ కూడా విలాసవంతమైన వస్తు సంపదను కలిగి ఉన్నారు. ఆమె ఉపయోగించే లగ్జరీ సేకరణలో కార్లు, ఇళ్ళు, జెట్ విమానాలు వంటివి కూడా ఉన్నాయి. అయితే ఆమె వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైనది. నీతా అంబానీ స్మార్ట్‌ఫోన్ ధర గరిష్టంగా రూ. 2 నుండి 5 లక్షలు ఉండొచ్చు అనుకుంటే పొరపడినట్టే..! ఎందుకంటే ఆమె ఫోన్ ధర మీ ఊహకు మించినది. మీరు దాని గురించి కనీసం ఒక అంచనా కూడా వేయలేనంత ఖరీదైనది.
నీతా అంబానీ ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ ధర ఎంతో తెలిస్తే షాక్ తింటారు. వాస్తవానికి, నీతా అంబానీ ఉపయోగించే ఈ మోడల్ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్. దీని ధర సామాన్యులకు ఊహాకు కూడా అందనిది. చాలా మంది కోటీశ్వరులు కూడా దీనిని భరించలేరు. ప్రపంచంలోని 5 అత్యంత ఖరీదైన ఫోన్‌లలో నీతా అంబానీ ఉపయోగించే ఫోన్ కూడా ఉంది. వాటి ధర ఎంతంటే..కొన్ని చార్టర్డ్ విమానాలను కొనుగోలు చేయొచ్చట. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు ఇవి..
ఫాల్కన్ సూపర్నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ (Falcon SuperNova iPhone 6 Pink Diamond) స్టువర్ట్ హ్యూస్ ఐఫోన్ 4ఎస్ ఎలైట్ గోల్డ్(iphone 4S Elite Gold) స్టువర్ట్ హ్యూస్ ఐఫోన్ 4 డైమండ్ రోజ్ ఎడిషన్ (iPhone 4 Diamond Rose Edition) గోల్డ్ స్ట్రైకర్ ఐఫోన్ 3GS సుప్రీం (Goldstriker iPhone 3GS Supreme) ఐఫోన్ 3G కింగ్స్ బటన్ ( iPhone 3G King’s Button) ఫాల్కన్ సూపర్నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ (Falcon SuperNova iPhone 6 Pink Diamond) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్.
దానిలో పొందుపరిచిన విలువైన పింక్ డైమండ్ కారణంగా ఇది చాలా ఖరీదైనది. ఇక ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. దీనిని కొనుగోలు చేయడానికి $ 48.5 మిలియన్లు (దాదాపు రూ. 395 కోట్లు) చెల్లించాలి. ఈ ఫోన్ నిజానికి iPhone 6 కోసం ఫాల్కన్ సూపర్‌నోవా అనుకూలీకరించిన వెర్షన్. ఇదే ఐఫోన్ 6 2004లో విడుదలై బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని తయారు చేస్తున్నప్పుడు, ఐఫోన్ 6లో 24 క్యారెట్ బంగారాన్ని ఉపయోగించారు. దానితో పాటు పెద్ద పింక్ డైమండ్ ఫోన్ వెనుక ప్యానెల్‌కు పొందుపరిచారు. ఇది ఈ ఫోన్‌ను విలువైన పరికరంగా చేస్తుంది.