100 కోట్లు ఇచ్చిన ఆ హీరోతో నటించనన్న నయనతార, ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?
తమిళ నటుడు శరవణన్ గతంలో నా సినిమాలో హీరోయిన్ గా నటిస్తే రెట్టింపు రెమ్యూనరేషన్ ఇస్తానని చెప్పాడట. అయితే నటి నయనతార మాత్రం 100 కోట్ల ఇచ్చిన నీతో కలిసి నటించను అని కౌంటర్ ఇచ్చిందట. తమిళ నటుడు శరవణన్ సినిమా లెజెండ్‌లో నటించేందుకు నయనతారతో చర్చలు జరిగాయి. కానీ ఈ నటి అంగీకరించలేదు. నయనతారకు బదులుగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా శరవణన్ కథానాయికగా నటించింది.
అయితే నయన్ ఒక్కో మూవీకి సుమారు రూ. 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఓ సినిమాకి ఇంతకు రెట్టింపు ఇస్తానని చెప్పాడట ఓ హీరో. కానీ ఆ మూవీని ఆమె తిరస్కరించిందని తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. తమిళనాడు బిగ్గెస్ట్ బిజినెస్ మెన్ లెజెండ్ శరవణన్. ‘ది లెజెండ్’ అనే మూవీతో 2022లో ప్రేక్షకుల ముందుకువచ్చాడు శరవణన్.
కానీ ఆ మూవీ దారుణమైన కలెక్షన్లతో పాటుగా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా నయనతారను తీసుకుందామని అనుకున్నారట. అందుకోసం భారీ మెుత్తంలో రెమ్యునరేష్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాట శరవణన్. ఆమెను ఎలాగైనా తన పక్కన హీరోయిన్ గా నటింపజేయాలని ముచ్చటపడ్డాడు ఈ హీరో. కానీ నయన్ మాత్రం అతడి పక్కన 100 కోట్లు ఇచ్చినా నటించనని డైరెక్ట్ గానే చెప్పేసిందని సమాచారం.
అప్పట్లో నయన్ ఇంటి ముందు రోజూ రోల్స్ రాయిస్ కారు ఉండేదట. ఆ లగ్జరీ కారు శరవణన్ దే. ఆమెను సినిమా కోసం ఒప్పించేందుకు చాలాసార్లు ఆమె ఇంటికి వెళ్లేవాడట. ఎన్నిసార్లు నయన్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా.. పాపం కనికరించలేదు. దీంతో కసితో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటెలాను దింపాడు లెజెండ్ శరవణన్. ఈ సినిమా కోసం ఊర్వశీ బాగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.