News

నయనతార జాతకంలో గండం ఉందా..? వరుస పూజల వెనుక రహస్యం అదే.

నయనతార .. సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. లేడీ సూపర్ స్టార్ గా తన ఇమేజ్ ను పెంచుకున్న తార. ఈ వయస్సులో కూడా భారీగా రెమ్యూనరేషపన్ అందుకుంటున్న హీరోయిన్.. ఇలా ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అందానికి అందం నటనకి నటన మరీ ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తమిళంలో మాత్రమే కాదు.. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్, మాలీవుడ్ లతో పాటు.. ఈ మధ్య బాలీవుడ్ లో కూడా జవాన్ సినిమాతో తన సత్తా చాటుకుంది సీనియర్ బ్యూటీ.

బాలీవుడ్ లో తనదైన స్టైల్ లో నటించి షారుక్ ఖాన్ లాంటి వారితో శభాష్ అనిపించుకుంది. బాలీవుడ్ లో కూడా ఆమె ఒక్క సినిమాతో స్టార్ గా మారంది. ఇది ఇలా ఇంటే ఇటీవల కాలంలో నయనతార నిత్యం దేవాలయాల సందర్శకు వెళ్తుంది. అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆమె అలా ఎందుకు చేస్తుందని తన అభిమానులకు ఆలోచిస్తున్నారు. నయనతార జాతకంలో గండం ఉందా ..? ఆ గండం నుంచి తప్పించుకోవడానికి ఇలా భర్తతో పూజలు చేస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో తరచూ సినిమా షూట్స్ కి బ్రేక్ చెప్పి మరి భర్తతో కలిసి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో పూజలు చేస్తుంది. మరీ ఇంత డెడికేషన్ గా ఆమె గతంలో ఎన్నడూ పూజలు చేసింది లేదు. దీంతో సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. నయనతార జాతకంలో గండం ఉందట. ఆ గండం కారణంగా ఆమె వైవాహిక జీవితంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందట. అంతేకాదు తన పిల్లలకు కూడా టాప్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు రావచ్చట.

ఆ కారణంగానే నయనతార ప్రత్యేక పూజలు చేయిస్తుందట. ప్రస్తుతం ఇదే న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కాగా పెళ్లి తర్వాత నయనతార హై రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది. అంతకుముందు ఆరు ఏడు కోట్లు తీసుకుంటే ఇప్పుడు ఏకంగా 10 – 12 కోట్లు ఛార్జ్ చేస్తుంది. అయినా సరే నయనతార కాల్ షీట్స్ మొత్తం బిజీబిజీగా ఉండడం గమనార్హం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker