నరాల నొప్పితో బాధపడుతున్నారా.? శాశ్వతంగా తగ్గించే చిట్కా ఇవే.
సహజంగా నరాల నొప్పి మధుమేహం ఉన్నవారిలో, మందులు ఎక్కువగా వాడుతున్న వారిలో లేదా కీమోథెరపీ నుండి దుష్ప్రభావాల వల్ల, గాయాలు వంటి వైద్య పరిస్థితుల వల్ల సంభవిస్తుంది. మెదడు మరియు వెన్నుపాము సమస్య ఉన్నప్పుడు నరాల నొప్పి విపరీతంగా బాధిస్తుంది. ఇక అదే విధంగా కండరాలు మరియు అవయవాల మధ్య నరాలలో ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నరాల నొప్పి వచ్చే అవకాశం ఉంది. అయితే నేటి యువత చాలా మంది కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాలు గాని వ్యాపారాలు గాని చేస్తున్నారు.
దీనివలన మెదడుపై విపరీతమైన భారం పడటంతో తీవ్రమైన నరాలు నొప్పులతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలి లేకపోవడం, వ్యాయామం లేకపోవడం.. పౌష్టికాహారం తీసుకోకపోవడంతో నరాల సమస్యలు ఇప్పుడు జనాలను విపరీతంగా బాధిస్తున్నాయి. సహజంగా నరాల నొప్పి మధుమేహం ఉన్న వారిలో, మందులు ఎక్కువగా వాడుతున్న వారిలో లేదా కీమోథెరపీ చేయించుకుంటున్న వారిలో ఎక్కువగా ఈ నొప్పి ఉంటుంది.
అలాగే మెదడు మరియు వెన్నుపాము సమస్య ఉన్నప్పుడు కూడా నరాల నొప్పి విపరీతంగా బాధిస్తుంది. అలాగే విటమిన్ బి1, బి12 లోపం ఏర్పడినప్పుడు, నరాలకు రక్తం సరఫరా తగ్గినప్పుడు నరాలు సహజంగా నొప్పికి గురవుతాయి. ఈ బాధ భరించలేనిదిగా ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమం. అలా కాకుండా నొప్పి చిన్నగా ఉండేటట్లయితే సరియైన ఆహారం తీసుకోవడం ద్వారా నొప్పిని అదుపులో ఉంచుకోవచ్చు.
ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పసుపుని చేర్చుకోవటం రాత్రి సమయంలో పడుకునే ముందు ఒక గ్లాసు వేడిపాలలో పసుపు కొంచెం.. మిరియాల పొడి కలుపుకొని తీసుకోవటం వల్ల నరాల నొప్పి తగ్గుతుంది. పసుపులో ఉండే యాంటీబయాటిక్ లక్షణాలు వల్ల నరాల నొప్పి తగ్గుతుంది. అలాగే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి అందులో ఒక స్పూన్ తేనె కలిపి వారంలో రెండు సార్లు తాగితే నరాలు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
దాంతో పాటు మెగ్నీషియం అధికంగా ఉండే వాల్నట్స్, పుచ్చకాయ, బచ్చల కూర, అరటిపండు వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా మీ డైట్ లో చేర్చుకోండి. దీనికి తోడు సరియైన వ్యాయామం చేస్తే నరాల నొప్పిని అదుపులో ఉంచవచ్చు.