మీ నాలుక ఇలా తెల్లగా ఉందా..? మీరు ఎంత ప్రమాదంలో ఉన్నరో తెలుసుకోండి.
నాలుకలోని రక్త నాళాలు లాలాజలమును సమృద్ధిగా సరఫరా చేస్తూ నిరంతరం ప్రవహించే విధంగా చేస్తాయి. ఈ విధంగా నాలుక నిరంతరం శుభ్రం చేస్తుంది. అందువలన హానికరమైన బ్యాక్టీరియా వృద్ధి తగ్గుతుంది. ఆరోగ్యకరమైన నాలుక రంగు పింక్ రంగులో ఉంటుంది. చాలా సార్లు, మనం తినే ఆహారం కారణంగా నాలుక రంగు మారుతుంది. అదే ఇతర సమయాల్లో ఆరోగ్య సమస్యను సూచిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో ఉన్న సమతుల్య ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
శరీరంలో ఎలాంటి పోషకాహార లోపం లేకపోతేనే ఆరోగ్య సమస్యలు మనకు దూరంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్స్‌లలో ఏది లోపించిన శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ విధంగా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో విటమిన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే శరీరానికి అవసరమైన, అత్యవసరమైన పోషకాలలో విటమిన్ బి12 కూడా ఒకటి. ఇది DNA సంశ్లేషణలో సహాయపడే ఒక ముఖ్యమైన పోషకం. అంతేకాక శరీరానికి కావలసిన శక్తి ఉత్పత్తిలో కూడా ప్రధాన పాత్ర పోషించడంతో పాటు కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరుకు సహాయపడుతుంది.
ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో, మెదడు ఆరోగ్యాన్ని కాపాడి దాని పనితీరును మెరుగుపరచడంలో కూడా దీని పాత్ర చాలా ప్రధానమైనది. ఇక మన శరీరంలో విటమిన్ బి12 తగినంత స్థాయిలో లేకపోతే శరీరంపై అనేక రకాలుగా దాని ప్రభావం కనిపిస్తుంది. విటమిన్ బీ12 లోపం వల్ల కలిగే సమస్యలు.. అలసట.. శరీరంలో విటమిన్ బి12 లోపించినప్పుడు శరీరమంతా ఆక్సిజన్ ప్రవహించే వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఆక్సిజన్ డెలివరీ కణాలకు సరిగ్గా కాకపోతే అది రక్తహీనతకు దారితీస్తుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కూడా తగ్గడంతో మెగాలోబ్లాస్టిక్ అనిమియా అనే సమస్య వస్తుంది.
దీనివల్ల రక్తహీనతతో పాటు అలసట, తలనొప్పి, మూడు స్వింగ్స్ వంటి సమస్యలు వస్తాయి. జీర్ణ సమస్యలు.. విటమిన్ బి12ను కేవలం ఆహారం నుంచి మాత్రమే మన శరీరం పొందగలదు. పొట్టలోని హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎంజైమ్‌లు, విటమిన్ బి12ను ఆహారం నుంచి విడదీయడంలో సహాయపడతాయి. విటమిన్ బి12 లోపిస్తే జీర్ణవ్యవస్థపై ఆ ప్రభావం పడుతుంది. జీర్ణాశయంలో తగినంత ఆక్సిజన్ అందదు. ఇది అతిసారం, వికారం, మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్, ఆకలి లేకపోవడం, హఠాత్తుగా బరువు తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది.