Health

మీ నాలుక ఇలా మారిందా..? దానికి కారణాలు ఏంటో తెలిస్తే..?

నాలుక పూర్తిగా కండరాలతో చేయబడిన నోటిలోని భాగం. ఇది ఆహారాన్ని నమలడం, మింగడంలో ఉపకరిస్తుంది. దీనివల్లనే మనకు రుచి తెలుస్తుంది. లాలాజలం దీన్ని ఎప్పుడూ తడిగా ఉంచుతుంది. మనం మాట్లాడడానికి కూడా ఇది సహకరిస్తుంది. అయితే నాలుక శుభ్రం చేసుకోకపోతే తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దాన్ని నోటి లేదా ఓరల్ థ్రష్ అంటారు. ఇది సాధారణమైనది. సులభంగా చికిత్స కూడా చేసి వీటిని తొలగించుకోవచ్చు. ఈ సమస్య వచ్చినప్పుడు నోట్లో తరచుగా పుండ్లు పడటం, రుచి తెలియకపోవడం, తినడం, తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది. చికిత్స తర్వాత తగ్గిస్తుంది.

రోగనిరోధక వ్యవస్థలో సమస్య ఉంటే కూడా ఇలా జరుగుతుంది. నాలుక మీదే కాకుండా నోరంతా కూడా ఇలా తెల్ల మచ్చలు లేదా పుండ్లు వస్తే ఆ వ్యాధిని ల్యూకోప్లాకియా అంటారు. దీర్ఘకాలం పాటు ధూమపానం చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇవి చాలావరకు నిరాపాయమైనవి. కానీ క్యాన్సర్‌కు ముందు కూడా ఇలా వస్తుంది. అందుకే నోట్లో తెల్ల మచ్చలు కనిపిస్తే వెంటనే దంత వైద్యులను సంప్రదించాలి. నోటిపూతలు నోట్లో లేదా నాలుకపై పుండ్లు రావడం సర్వసాధరమైన విషయం.. అయితే అందరూ.. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే ఇలా జరుగుతుంది అనుకుంటారు.

ఇది అపోహ మాత్రమే.. కొన్ని రోజుల పాటు ఉండి పోతే సరే.. నోట్లోని పుండ్లు నయం కాకుండా నాలుకపై ముద్దగా అలాగే ఉంటే మాత్రం అది క్యాన్సర్‌కి సంకేతం కావచ్చు. వెంటనే దంత వైద్యులని కలిసి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. నాలుక మీద గీతలు ఎక్కువగా పడటం.. ఇది సాధారణ పరిస్థితి, తీవ్రమైనది కాదు. సిట్రస్ పండ్లు లేదా స్పైసీ ఫుడ్స్ వంటి కొన్ని ఆహారాల పదార్థాలు అతిగా తీసుకుంటే ఇలా నాలుక మీద గీతల్లా ఏర్పడతాయి. నాలుక మీద వెంట్రుకలు ఏంట్రా అనుకుంటున్నారా.. అవును వస్తాయి.. నాలుకపై ఉండే అతి చిన్న చిన్న బుడిపెలపై ఏర్పడే బ్యాక్టీరియా, నోటిలోని వ్యర్థాల కారణంగా నాలుక నల్లగా మారుతుంది.

అంతే కాదు నాలుకపై వెంట్రుకలు కూడా మొలుస్తాయి. సాధారణంగా ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఎక్కడో ఒకరిద్దరికి ఇలా జరుగుతుంది. వైద్య పరిభాషలో దీన్నే హెయిరీ టంగ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. నోట్లో బ్యాక్టీరియా, ఈస్ట్ పెరుగుదలకి ఇది కారణం అవుతుంది. తీవ్రమైన సందర్భాల్లో నాలుక మీద వెంట్రుకలు సాధారణ పొడవు కంటే 15 రెట్లు ఎక్కువగా పెరుగుతాయి. పేలవమైన నోటి పరిశుభ్రత, ధూమపానం వల్ల ఇది సంభవిస్తుంది. నాలుక శుభ్రంగా లేకపోతే ఈ సమస్యలన్నీ వస్తాయి..కాబట్టి.. పళ్లు శుభ్రతతో పాటు నాలుకను కూడా క్లీన్‌ చేసుకోవడం చాలా ముఖ్యం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker