ఆ సమస్యలున్నవారు వీటిని గుర్తుపెట్టుకొని మరి తినాలి. ఎందుకంటే..?
నల్ల ద్రాక్ష రుచిలో తీపిగా ఉంటుంది. వీటి వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నల్లటి ద్రాక్షలో సీ-విటమిన్, ఏ-విటమిన్, బీ6, ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. ద్రాక్ష పండ్లలో ఉండే గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు మనల్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. అయితే ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో అనేక రకాల పోషకాలు దాగి ఉంటాయి. అందుకే ఆరోగ్య నిపుణులు వీటిని ప్రతి రోజు తీసుకోమని సూచిస్తారు.
ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, బీటా కెరోటిన్, కాల్షియం, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి ప్రస్తుతం మార్కెట్‌లో రెండు రకాలుగా లభిస్తున్నాయి. ఎండుద్రాక్ష ప్రయోజనాలు:- ఊబకాయం తగ్గుతుంది..బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు నానబెట్టిన నల్ల ద్రాక్షలను డైట్‌లో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో సహాజ చక్కెర ఉంటుంది. కాబట్టి వీటిని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు కూడా తీనవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా కరిగిస్తుంది. అయితే వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అతిగా తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చు. జీర్ణక్రియను మెరుగు పరుచుతుంది..బయట లభించే అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్షను తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మలబద్ధకం, గ్యాస్ సమస్యలను సులభంగా తగ్గిస్తుంది. దీంతో సులభంగా జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కంటి చూపును మెరుగు పరుచుతుంది..ప్రస్తుతం చాలా మంది విటమిన్ లోపం కారణంగా కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నారు.
అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు విటమిన్ ఎ, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధిక పరిమాణంలో లభించే ఎండుద్రాక్ష ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు కంటి చూపు లోపం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా కంటిశుక్లం పని తీరును కూడా మెరుగు పరుచుతుంది.