గోళ్లపై ఇలా తెల్లని మచ్చలు వస్తున్నాయా..? అది దేనికీ సంకేతమో తెలిస్తే..?
కొందరి వేళ్లపై మచ్చలు చిన్నగానే ఉన్నా మరి కొందరికి మాత్రం వెడల్పుగా కబడుతుంటాయి. అయితే ఇలా ఎందుకు వస్తుంటాయి అని భయపడుతుంటారు. ఈ మచ్చలు ఎందుకు వస్తుంటాయి. వైద్య పరిభాషలో ఈ స్థితిని లుకోనైకియా అంటారు. ఇది అత్యంత సహజసిద్ధమైనది. అయితే కొన్ని ఆనారోగ్య సమస్యల వల్ల కూడా చేతి వేళ్ల గోళ్లపై అలా తెల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. అయితే గోళ్ళ పై తెల్లటి మధ్యలో రావడం అనేది కూడా మన శరీరంలో కొన్ని విటమిన్స్ లోపించటం వల్ల వచ్చే సమస్య. కానీ ఈ సమస్యను అందరూ చాలా తేలికగా తీసుకుంటారు.
అయితే ఈ సమస్యను తేలికగా తీసుకొని నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరంలో విటమిన్లు లోపించటంతో గొళ్ళ పై తెల్లటి మచ్చలు వస్తాయని, ఈ విషయం తేలికగా తీసుకోవటం వల్ల కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణుల సూచిస్తున్నారు. శరీరంలో ఖనిజాలు, విటమిన్ల లోపం కారణంగానే గోర్లపై తెల్లని మచ్చలు ఏర్పడతాయని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ నమామి అగర్వాల్ వెల్లడించారు.
మన శరీరంలో ఉండే ప్రతి అవయవాల ఆరోగ్యానికి వివిధ రకాల పోషకాలు అవసరం. అలాగే గోళ్ళ ఆరోగ్యానికి కూడా విటమిన్స్ చాలా అవసరం. కాల్షియం, జింక్ విటమిన్స్ లోపం వల్ల గోళ్ళ పై తెల్లటి మచ్చలు ఏర్పడతాయని, గోర్లు మామూలు స్థితికి రావాలంటే జింక్, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలని ఆవిడ సూచించారు. అయితే కాల్షియం జింక్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చేపలు గుడ్లు తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన క్యాల్షియం, జింక్ తో పాటు అనేక రకాల పోషకాలు కూడా మన శరీరానికి లభిస్తాయి. అంతేకాకుండా చిక్కుళ్లు, నట్స్, విత్తనాల్లో జింక్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య ఉన్న వారు ముఖ్యంగా ప్రతిరోజు పాలు తాగాలి. పాలలో , పాల ఉత్పత్తులలో క్యాల్షియం సమవృద్దిగా ఉంటుంది. అంతేకాకుండా రాగులు, నువ్వులు, వంటి తృణ ధాన్యాలలో కూడా క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గోర్లు కోరికే అలవాటు ఉన్న వారు ఈ అలవాటు మార్చుకోవాలని నిపుణుల సూచిస్తున్నారు.