సమంతకు వచ్చిన మైయోసైటిస్ వ్యాధి ఎలాంటి వ్యక్తులకు వస్తుందో తెలుసా..?
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మైయోసిటిస్ అనే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్న విషయం తెలిసిందే. అందులో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే అసలు మయోసిటిస్ అంటే ఏమిటి.. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్.
దీని వలన ఏం అవుతునంటే ఇమ్యూనిటీ అనేది స్వంత కణజాలాలపైనే పొరపాటుగా దాడి చేస్తుంది. ఇలా జరిగినప్పుడు కండరాలలో వాపులు రావడం, బలహీనత, దద్దర్లు రావడం వంటివి జరుగుతాయి. దీని తీవ్రత అలా పెరిగిపోతూ ఉంటుంది. మైయోసైటిస్ లక్షణాలు..కండరాల బలహీనత, అలసట, కూర్చోవడంలో ఇబ్బంది. తింటున్నప్పుడు ఆహారం మింగే క్రమంలో అసౌకర్యం, డిప్రెషన్. మయోసిటిస్ రావడానికి కారణాలు.. ఏ కారణం లేకుండా ఈ సమస్య రావచ్చు.
గాయం లేదా సంక్రమణ వలన కూడా తలెత్తవచ్చు. లేదా డ్రగ్ టాక్సిసిటీ, జలుబు, ఫ్లూ, హెచ్‌ఐవి వంటి వైరస్‌లు వలన కూడా రావచ్చు. దగ్గు, జలుబుతో కూడిన వైరల్ ఇన్ఫెక్షన్ వలన కూడా ఈ సమస్య రావచ్చు. కొన్ని రకాల కార్డియో వాస్కులర్ మెడిసిన్స్ వలన కూడ మయోసైటిస్ తలెత్తే అవకాశం వుంది. లేదా ఆల్కహాల్, కొకైన్ వంటివి తీసుకోవడం వలన ఇది వచ్చే అవకాశం వుంది. మైయోసైటిస్ లో స్టేజెస్.. మొదట నడవడం కష్టంగా అనిపిస్తుంది.
పడుకున్నప్పుడు తిరిగితే నొప్పి కలుగుతుంది. కూర్చున్న చోట నుండి లేవడం కష్టంగా అనిపించడం. మెట్లు ఎక్కడం కష్టంగా ఉండడం. వస్తువులను ఎత్తడం లో కష్టంగా ఉండడం ఇవన్నీ కూడా మైయోసైటిస్ లో స్టేజెస్. చికిత్స..రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి చికిత్స, లక్షణాలని తగ్గించేందుకు ఇలా చెయ్యచ్చు.. ఫిజియోథెరపీ, ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ,స్టెరాయిడ్స్‌తో చికిత్స.