ఏఆర్ రెహమాన్ లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్‌కి బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు.
ఇండియన్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు షాక్ ఇచ్చారు పూణె పోలీసులు. ఆదివారం నైట్ పూణెలోని రాజా బహదూర్ మిల్ ప్రాంతంలో లైవ్ కాన్సర్ట్ ఇచ్చాడు. ఈ మ్యూజికల్ ఈవెంట్‌కి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రోగ్రామ్ మంచి జోష్ మీద ఉంది. స్టేజ్‌పైన రెహమాన్ పాటలు పాడుతుండగానే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. రాత్రి 10గంటల వరకే ప్రోగ్రామ్‌కి పర్మిషన్ ఉందని..టైమ్ దాటిన తర్వాత కూడా ఎలా కొనసాగిస్తారంటూ మ్యూజికల్ కాన్సర్ట్‌ని ఆపివేయాలంటూ ఆదేశించారు.
అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్ పూణేలో జరిగింది. పెద్ద సంఖ్యలో అభిమానులు రెహమాన్ పాటలను ఎంజాయ్ చేస్తుండగా పోలీసులు వచ్చి షాక్ ఇచ్చారు. మధ్యలో స్టేజీ మీదకు వచ్చి ఆపేశారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ఇటీవల పూణేలో లైవ్ కాన్సర్ట్ ఇచ్చారు.
మధ్యలోనే పోలీసులు ప్రోగ్రాం ఆపేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి 10 గంటల గడువును మించిపోయారని పేర్కొంటూ వివరణ ఇచ్చారు. ఏఆర్ రెహమాన్ కచేరీని పోలీసులు అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక అభిమాని వీడియోను పోస్ట్ చేసి, తన నిరుత్సాహాన్ని వ్యక్తం చేశాడు. AR Rahman సంగీత కచేరీని రాత్రి 10.14 గంటలకు ఆపేయడం చాలా నిరాశపరిచిందని చెప్పుకొచ్చాడు.
రాత్రి 10 గంటలకు గడువు ముగిసినప్పటికీ.. అతని స్థాయికి ఇలా చేయాల్సింది కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన జరిగే సమయంలో రెహమాన్ చివరి పాట పడుతున్నారు. ప్రదర్శనను ఆపడానికి పోలీసులు వేదికపైకి వచ్చినప్పుడు చైయా చయ్యా పాటను పాడుతున్నాడు. ఈ ఘటనపై పూణే పోలీసులు వివరణ ఇచ్చారు. ‘రెహమాన్ తన చివరి పాట పాడుతున్నాడు. అప్పటికే రాత్రి 10 గంటలు దాటిందని అతనికి తెలియదు. కాబట్టి వేదిక వద్ద ఉన్న మా పోలీసు అధికారి వెళ్లి తెలియజేశాడు.
మార్గదర్శకాల ప్రకారం అనుసరించాల్సిన గడువు, ఆ తర్వాత అతను పాడటం మానేశాడు.’ అని పోలీసులు తెలిపారు. పూణేలోని రాజా బహదూర్ మిల్ ప్రాంతంలో AR రెహమాన్ కచేరీ జరిగింది. ఈవెంట్ సమయాలు రాత్రి 8-10 గంటల వరకు ఉన్నాయి. గడువు దాటినప్పుడు పోలీసులు జోక్యం చేసుకున్నారు. గడువు ముగిసిన తర్వాత కచేరీని ఎందుకు ఆపలేదని కూడా ప్రశ్నించారు.