Health

పుట్టగొడుగులు తిని ప్రాణాలు కోల్పోయిన తండ్రికొడుకులు, ఏం జరిగిందో తెలిస్తే..?

ప్రపంచానికి పెను సవాలుగా మారిన కాన్సర్ నివారణలో పుట్టగొడుగులు బాగా పనిచేస్తున్నాయి. మైటేక్, క్రిమినీ, పోర్టాబెల్లా, ఓయస్టర్, వైట్ బటన్ వంటి రకాల పుట్టగొడుగులు… బ్రెస్ట్ కాన్సర్ ను తగ్గిస్తున్నాయి. బాడీలో కొత్త కణాలు పెరిగేలా చేస్తున్నాయి. వాటిలోని లెంటినాన్ అనే షుగర్ మాలిక్యూల్… కాన్సర్ పేషెంట్లకు ప్రాణం పోస్తోంది. అయితే పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో కొన్ని వరకే మనం తినగలిగినవి.. కొన్ని విషపూరితమైనవి ఉంటాయి.

అలాంటి విషపూరిత పుట్టగొడుగులు తిని.. దక్షిణ కర్ణాటకలో తండ్రి కొడుకూ చనిపోయారు. బెల్తాన్‌గాడీ.. పతువేట్ తాలూకా.. పల్లాడపల్కాలో ఈ ఘటన జరిగింది. 80 ఏళ్ల గురువ, ఆయన కొడుకు 41 ఏళ్ల ఒడియప్ప ప్రాణాలు కోల్పోయారు. సోమవారం సాయంత్రం ఊరికి దగ్గర్లోని.. అడవిలోకి వెళ్లిన ఒడియప్ప.. అక్కడ కొన్ని పుట్టగొడుగుల్ని చూశాడు. వాటిని వండుకొని తింటే.. ఆ రాత్రి కూర అయిపోతుందిలే అనుకున్నాడు. వాటిని తీసుకొని ఇంటికి వచ్చాడు.

ఈ రాత్రికి మనం మంచి వంట వండుకుందాం.. అంటూ.. పుట్టగొడుగులు వండాడు. ఆ రోజు ఉదయమే సిటీకి వెళ్లిన కర్త.. రాత్రికి ఇంటికి రాలేదు. దాంతో ఒడియప్ప, గురువ ఆ కూరను అన్నంలో కలుపుకొని తిన్నారు. మంగళవారం కర్త.. ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు ఒడియప్ప శవమై కనిపించాడు. లోపలికి వెళ్లి చూస్తే.. లోపల పెద్దాయన కూడా చనిపోయి ఉన్నాడు. విషయం తెలిసి ఊరోళ్లు.. పరుగున వచ్చారు. ధర్మస్థల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. విషపూరిత పుట్టగొడుగుల కూర తినడం వల్లే చనిపోయారని భావిస్తున్నారు. ఇద్దరి నోటి నుంచి నురగలు బయటకు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. ఒడియప్పకు కొంత మానసిక సమస్యలున్నాయి. అప్పుడప్పుడూ అతను ఇంట్లో గట్టిగా అరుస్తాడట… సోమవారం రాత్రి కూడా అలాగే అరిచినా.. చుట్టుపక్కల వాళ్లు పట్టించుకోలేరు. ఎప్పుడూ ఉండేదేగా అనుకుని లైట్‌ తీసుకున్నారు.. అడవుల్లో దొరికే వాటిని తెలిసీ, తెలియకుండా తినవద్దని పోలీసులు కోరుతున్నారు. మనం చేసే చిన్న తప్పులే నిండు ప్రాణాలను తీస్తాయి.. ఏది ఏమైనా..ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker