Health

రోజుకు ఇవి మూడు ఆకులు తినడం అలవాటు చేసుకోండి, జీవితంలో హాస్పిటల్ జోలికి వెళ్లారు.

మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఎని పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్‌లో మునగాకును వాడతారు. మునగను అన్ని వంటకాల్లో వినియోగిస్తుటారు. మునగ కాడలు, ఆకులు, కాయలు, పువ్వుల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అంతేకాదు ఇందులో కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఎ, సి బి కాంప్లెక్స్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి.

మునగ ఆకు, కాయలు, పువ్వులతో ఎన్నో రకాల వంటకాలు చేస్తుంటారు. అంతేకాదు మునగ టీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మునగ పోషకాల పవర్ హౌజ్. మునగలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. మునగాకుల్లోనూ యాంటీ ఆక్సిడేటివ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి వాతావరణంలో ఉండే ఫ్రీ రాడికల్స్.. హానికరమైన ప్రభావాల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. 100 గ్రాముల మునగ ఆకులను ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకున్నట్లయితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మునగ ఆకులలో విటమిన్ సితోపాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక పనితీరును పెంపొందిస్తాయి. అంతేకాదు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. మునగ ఆకుల్లో ఫైబర్ కంటెంట్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మునగ ఆకులలో ఉండే విటమిన్ A కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మునగ ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు అభిజ్ఞా పనితీరుకు మేలు చేస్తాయి. న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలను కలిగి ఉంటుంది.

కొన్ని అధ్యయనాలు మునగ ఆకులు మెరుగైన కాలేయ పనితీరుకు దోహదపడతాయని, కాలేయ వ్యాధుల నుంచి కాపాడుతుందని సూచిస్తున్నాయి. మునగ ఆకులలో తక్కువ-గ్లైసెమిక్ స్వభావం ఉంటుంది. అంతేకాదు ఈ ఆకుల్లో ఉండే ఫైబర్ కంటెంట్ షుగర్ పేషంట్లకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. మునగ ఆకుల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మునగ ఆకులను ఆహారంలో చేర్చుకోవచ్చు.

మునగ ఆకులు గర్బిణీలకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ A, విటమిన్ C, ఐరన్ వంటి పోషకాలు గర్బిణీలకు కావాల్సిన శక్తిని అందిస్తాయి. అయితే అధిక మోతాదులో కాకుండా మితంగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి:- అలెర్జీ సమస్యలు ఉన్నవారు మునగ తినకపోవడమే మంచిది. మునగ ఆకులలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి. మోతాదుకు మించి తింటే జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker