ముల్లంగి ఆకులలో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు. ఒక్క ఆకూ తిన్నా చాలు.
ముల్లంగి ఆకులో శరీరానికి అవసరమైన అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి.ఇవి శరీరం యొక్క పనితీరును మేరుగుపరచటంలో సహాయపడతాయి. ముల్లంగి ఆకులో కాల్షియం, భాస్వరం, ఇనుము వంటి ఖనిజాలు,విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం ఉంటాయి.ఇవి శరీరంలో అనేక విధులను నిర్వర్తించటానికి సహాయపడతాయి. అయితే శీతాకాలంలో ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టిసారించాలి. ఈ కాలంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదముంది.
కావున చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలను తినాలి. ఇందుకోసం చాలామంది మార్కెట్లోకి ఎక్కువగా వచ్చే కూరగాయలు, ఆకు కూరలను తింటుంటారు. ఈ కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. చలికాలంలో వచ్చే ముల్లంగిని చాలామంది ఇష్టపడతారు. అయితే.. ముల్లంగి కొనేటపుడు దాని ఆకులను పడేస్తుంటారు. కానీ ఆ ముల్లంగి ఆకుల్లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధాలు ఉంటాయి. ముల్లంగి ఆకులతో కూర చేసుకున్నా.. లేకపోతే రసం చేసుకొని తాగినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
ఈ ముల్లంగి ఆకుల రసంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, క్లోరిన్, సోడియం, ఐరన్, మెగ్నీషియం, అలాగే విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు శరీరంలోని అనేక సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ముల్లంగి ఆకుల రసం ప్రయోజనాలు:- జీర్ణక్రియ ముల్లంగి ఆకులలో తగిన మొత్తంలో పీచు ఉంటుంది.
ఇది ప్రతి ఒక్కరి ఉదరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముల్లంగి ఆకులతో తయారుచేసిన పానీయం తీసుకుంటే జీర్ణక్రియ సమస్యను అధిగమించవచ్చు. స్థూలకాయం మీరు చలికాలంలో బరువు తగ్గాలనుకుంటే.. దీనిని ఉపయోగిస్తే మేలు చేకూరుతుంది. ముల్లంగి ఆకులతో తయారుచేసిన పానీయాన్ని తీసుకోవడం ద్వారా మీరు సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. దీనిలోని పోషకాలు కొవ్వును తగ్గిస్తాయి.
రక్తపోటు సమస్య రక్తపోటు సమస్య ఉన్నట్లయితే, ముల్లంగి ఆకుల పానీయం తీసుకుంటే మేలు. రక్తపోటు బాధితులు ప్రతిరోజూ తీసుకుంటే.. బీపీ తగ్గుతుంది. ముల్లంగి ఆకులలోని సోడియం శరీరంలో ఉప్పు కొరతను తీర్చి.. బీపీని నివారిస్తుంది.