నోటి పూత తగ్గడం లేదా..? క్యాన్సర్ లక్షణం కావొచ్చు. వెంటనే..?
నోటి పుండు, అనేది నోటి శ్లేష్మ పొరపై ఏర్పడే పుండు. పెదవుల మీద లేదా మూతి చుట్టూ పగలటం ద్వారా ఇది వస్తుంది. నోటి పుండ్లు ఒక్కొక్కటిగా ఏర్పడవచ్చు, ఒకటికంటే ఎక్కువగా కూడా రావచ్చు. ఇవి చాలా అరుదుగా నోటి క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. అయితే గత పదేళ్ల కాలంలో దాదాపుగా 34 శాతం వరకు క్యాన్సర్ కేసుల సంఖ్య పెరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. గత సంవత్సర కాలంగా కేవలం యూకేలో 3 వేలకు పైగానే మౌత్ క్యాన్సర్‌తో మరణించినట్టు లెక్కలు చెబుతున్నాయి.
ఈ సంఖ్య గత 5 సంవత్సరాలతో పోలిస్తే 20 శాతం పెరిగిదంట..మౌత్ క్యాన్సర్ ను గుర్తించడంలో ఆలస్యం జరగడం వల్ల చికిత్సలో జాప్యం జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని లండన్‌కు చెందిన డాక్టర్ వికాస్ ప్రింజా తెలిపారు. మౌత్ క్యాన్సర్ లక్షణాలు.. నోటిలో ఏర్పడిన అల్సర్ త్వరగా మానక పోతే అనుమానించాల్సిందే.. నాలుక, పెదవులు, గడ్డం తిమ్మిరిగా ఉండడం నోటి లోపల తెల్లని లేదా ఎర్రని ప్యాచెస్ రావడం, దంతాల్లో అకస్మాత్తుగా వచ్చిన మార్పులు కారణాలు..ఆల్కహాల్, పోగాకు అలవాటున్న వారిలో నోటి క్యాన్సర్ ముంపు పొంచి ఉంటుంది.
అయితే కొన్ని సార్లు హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్ ) ఇన్ఫెక్షన్ కూడా మౌత్ క్యాన్సర్‌కు కారణం కావచ్చని డాక్టర్ నీల్ సిక్కా అభిప్రాయపడ్డారు. నోటి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల కూడా మౌత్ క్యాన్సర్ రావచ్చట. విరిగిపోయిన దంతాల వల్ల కూడా నోటిలో అల్సర్స్ ఏర్పడవచ్చు. అవి త్వరగా మానకపోతే ఆ అల్సర్లు క్యాన్సర్లుగా మారవచ్చు. ఎక్కువగా ఎండలో తిరిగే వారికి లిప్ క్యాన్సర్ రావచ్చు. ఇంట్లోనే ఎలా గుర్తించవచ్చు..నాలుక పైకి లేపి నాలుక కింద ఏవైనా మార్పులు వచ్చాయా అనేది గమనించుకుంటూ ఉండాలి.
నాలుక కింది నోటి అడుగున చూపుడు వేలితో నొక్కి ఏదైనా అసాధారణమైన వాపు లేదా, కణితి, అల్సర్ ఏదైనా ఉందేమో పరీక్షించుకోవాలి. నోటి లోపల దవడ చర్మం మీద ఏవైనా నొప్పి లేని లేదా నొప్పితో ఉన్న అల్సర్లు ఉన్నాయా అనేది పరీక్షించి చూసుకోవాలి. ఇలాగే చిగుళ్ల మీద కూడా నొక్కి చూసుకోవాలి. పై పెదవి ని కాస్త బయటికి లాగి దాని కింద చర్మంలో ఏవైనా అసాధారణ మార్పులు వచ్చాయేమో గమనించాలి. పెదవుల పైన కూడా రెండు వెళ్లతో నొక్కి పెట్టి కణితులు లేదా వాపులు ఉన్నాయేమో చూసుకోవాలి. ముఖం, దవడల మీద ఇదివరకు లేని కొత్త మార్పు లేదా వాపు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావల్సి ఉంటుంది.