Videos

ఈ కష్టం ఏ తల్లికి రాకోడదు, మేకప్ వేసుకున్న తల్లిని గుర్తుపట్టని చిన్నారి, వైరల్ వీడియో

పిల్లలను తమ వెంట తెచ్చుకున్నప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఫోకస్ అంతా వారి మీదే ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. చిన్న పిల్లలను అస్సలు వదిలేయకూడదు. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు.

పిల్లలు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటారు. వారి ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చు. అయితే ఇంటర్నెట్ లో నవ్వు తెప్పించే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మేకప్ వేసుకున్న తల్లిని గుర్తు పట్టక ఓ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తాడు.

మేకప్ మహత్యం అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. visagesalon1 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో అందరినీ కడుపుబ్బా నవ్వు తెప్పిస్తోంది.. మరోవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వీడియోలో అందమైన మేకప్ మరియు హెయిర్ స్టైల్‌తో నీలంరంగు లెహంగా వేసుకుని ఓ మహిళను చూసి చిన్నారి ఏడ్వడం మొదలుపెడతాడు.

మేకప్‌లో ఉన్న తన తల్లిని గుర్తుపట్టలేకపోతాడు. ఆమె దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తుంటే గుక్కపెట్టి ఏడుస్తాడు. అంతేకాదు తన తల్లిని తనకు ఇమ్మని అడుగుతాడు. నేనే మమ్మీని అని బాలుడికి చెబుతున్నా నువ్వు నా మమ్మీవి కాదు అంటాడు. చివరకి పిల్లవాడిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె అతడిని ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తుంది.

అయినా ఆమెను గుర్తించడు. ఈ వీడియో 22.8 మిలియన్ వ్యూస్ సంపాదించింది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ‘మేకప్ చాలా ప్రమాదకరమైనదని’ ..’మేజిక్ ఆఫ్ మేకప్’ అని అభిప్రాయపడ్డారు. మునుపెన్నడూ తల్లిని మేకప్‌లో చూసి ఉండకపోవడం వల్ల చిన్నారి గుర్తుపట్టకపోయి ఉండవచ్చని
నవ్వుకున్నారు.

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker